‘గీత గోవిందం’ ప్రివ్యూ

geetha govindam movie preview

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తోనే అంచనాలు పీక్స్‌కు చేరాయి. హీరో, హీరోయిన్‌ మేడం, సార్‌ అంటూ పిల్చుకోవడం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కాస్త ఎక్కువ డామినేటింగ్‌ ఉంటుంది. హీరోయిన్‌ పాత్ర కోసం స్టార్‌ హీరోయిన్‌లలో పలువురిని అడిగినట్లుగా తెలుస్తోంది. కాని చివరకు రష్మిక మందన హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. తనకు అప్పగించిన బాధ్యతను ఆమె పూర్తిగా నెరవేర్చినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

geetha govindam

హీరో, హీరోయిన్‌ మద్య సీన్స్‌ యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉండబోతున్నాయి. ఈకాలం అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని విధంగా విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంలో కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న అమ్మాయికు అడ్వాన్స్‌గా ఈ చిత్రంలో రష్మీక కనిపించబోతుంది. ఇదో విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని అల్లు అరవింద్‌ కూడా నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీగా విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్‌ చేస్తున్నాడు. రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. విజయ్‌ దేవరకొండతో పాటు రష్మికకు ఈ చిత్రం సక్సెస్‌ చాలా అవసరం. మరి వారికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

 geetha govindam movie