కత్తి బహిష్కరణ… ఇప్పుడు ఎక్కడున్నాడంటే ?

Kathi Mahesh stay in Karnataka after Police Barred from entering Hyderabad

శ్రీ రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేష్ ను హైదరాబాద్ నగరం నుండి ఆరు నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందువల్ల హిందూ మతానికి చెందిన వారు తీవ్ర స్థాయిలో మహేష్ కత్తి పై విరుచుకుపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డజన్ల కొద్దీ కేసులు అతని పై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఆవకాశం ఉండడంవల్ల తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పోలీసులు ఆయన్ని ఏపీ టాస్క్ ఫోర్సు పోలీసులకి అప్పగించడంతో తాను ఇంటికి వస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎల్లమంద గ్రామంలో ఉన్న తండ్రికి కత్తి మహేష్ సమాచారమిచ్చారు. కానీ రాత్రి పొద్దుపోయేదాకా మహేష్ అక్కడికి వెళ్లలేదని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం కత్తి మహేష్ కర్ణాటకలో తమ బంధువుల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కత్తి మహేష్ ను బహిష్కరించాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నుంచి కూడా మహేష్ ను బహిష్కరించాలని విజయవాడలోని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి. చర్యలు తీసుకోని పక్షంలో, తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.