కౌశల్‌ పై కత్తి కామెంట్స్‌…

Kathi Mahesh Sensational Comments on Kaushal

ఆమద్య రామాయణం మరియు రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ పోలీసులు బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌కు దూరంగా ఉంటున్న కత్తి మహేష్‌ ఈమద్య కాస్త కనిపించకుండా పోయాడు. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న కత్తి మహేష్‌ తాజాగా తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 పార్టిసిపెంట్‌ కౌశల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 పార్టిసిపెంట్స్‌లో అత్యంత నస, సోది వ్యక్తి కౌశల్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఊరికే ఏదో వివాదాన్ని కోరుకునే వ్యక్తి కౌశల్‌ అంటూ కత్తి వ్యాఖ్యలు చేశాడు. కత్తి మహేష్‌ చేస్తున్న విమర్శలపై కౌశల్‌ ఆర్మీ కూడా తీవ్రంగా స్పందిస్తోంది.

Mahesh Kathi's Rs. 500 Offer

తాజాగా కత్తి మహేష్‌ ఫేస్‌బుక్‌లో.. కౌశల్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ అయితే మనమంతా కూడా మూర్ఖులం అంటూ పోస్ట్‌ చేశాడు. అంటే కౌశల్‌కు ఓట్లు వేసే ప్రతి ఒక్కరు కూడా మూర్కులు అంటూ కత్తి మహేష్‌ అభిప్రాయం. కత్తి మహేష్‌ చేసిన విమర్శలు కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే అంటూ కౌశల్‌ ఆర్మీ అంటుంది. గతంలో పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించిన కత్తి మహేష్‌ ఇప్పుడు కౌశల్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కత్తి మహేష్‌ బహిరంగంగానే తన మద్దతును టీవీ9 దీప్తికి మద్దతు పలికాడు. దీప్తి తరపున కత్తి మహేష్‌ క్యాంపెయినింగ్‌ నిర్వహిస్తున్నాడు.