రాఫెల్ డీల్ పై వెన్నకి తగ్గేది లేదు : అరుణ్ జైట్లీ

Rafale Deal will Not Be Cancelled In Arun Jaitley

దేశం అంతటా రాఫెల్ డీల్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్న విషయం అందరికి తెల్సిన విషయమే దీని పై అటు ప్రతి పక్షాలు అటు ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సోషల్ మీడియా లో నెటిజన్స్ విపరీతంగా ప్రభుత్వాన్ని తప్పు పడ్తున్నాయి, కేవలం తమ స్వలాభం కోసమే బీజేపీ ప్రభుత్వం రాఫెల్ డీల్ ను హిందూస్తాన్ ఎయిర్ లిమిటడ్ కి కాకుండా రిలయన్స్ ని ప్రతిపాదించింది మొన్న ఒక ఫ్రెంచ్ వెబ్సైటు తన పత్రిక లో తెలిపిన దగ్గర నుండి తీవ్ర వ్యాత్రికేత చోటు చేసుకుంది.

arun jaitley rafale deal

 

దీని పై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఫ్రాన్స్ మాజీ ప్రధాన మంత్రి చెప్పినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వం రాఫెల్ డీల్ పై తాము వెన్నకి తగ్గబోము అని అరుణ్ జైట్లీ స్పష్టం చేసారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తో యధావిగా డీల్ కొనసాగుతుంది అని అది 36 రఫెల్ యుద్ధ విమానాల కూడిన కాంట్రాక్టు అని అరుణ్ తెలియచేసారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతి పక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారు అని మండి పడ్డారు. ఈ విమర్శలు అన్ని బీజేపీ ని మోడీ ప్రతిష్టని దెబ్బ తీసే అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ, ఫ్రాన్స్ పార్టీ ఇద్దరు కలిసి తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని, ఇద్దరు ఒకే సరి ఒకే ఆరోపణ చెయ్యడం యాదృచ్చికం కాదని అని అన్నారు.

Rahul Gandhi And Arun Jaitley

ఆగష్టు 30 రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దేశం అంతటా పెద్దతి దూమారాన్నే లేపింది, ఆ ట్వీట్ ని ప్రస్తావిస్తూ కొన్ని రోజులులలో పెద్ద బాంబు లే వెళ్తాయని అరుణ్ జైట్లీ ట్విట్టర్ ద్వారా తెలియచేయారు. ఇంత జరుగుతున్న అయితే ఈ విషయం పై రిలయన్స్ కంపెనీ నోరు విప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలగా చేస్తుంది