తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదు అనడంపై విజయశాంతి ఆగ్రహం

ప్రముఖ నటి మరియు కాంగ్రెస్ లీడర్ విజయశాంతి తెలంగాణ లో మావోయిస్టులకు చోటు లేదు అనడం సరికాదని అని అన్నారు. ఎక్కడైతే ప్రజలు అణచివేతకు గురి అవుతారో అక్కడే తీరుగుబాటు వస్తుందని విజయశాంతి హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ లో జరిగిన శృతి సాగర్ లు పై హత్యా జరిగిన సంగతి అందరికి విదితమే. ఈ సంఘటన అందరిని తీవ్రం గా కలిచి వేసింది, దీని మీద రాష్ట్రము నలుమూలలు నుండి తీవ్ర స్థాయి లో విముఖత ఏర్పడింది.

vijayashanthi respond

ఇప్పుడు అదే విషయాన్నీ విజయశాంతి మీడియా ముందు ప్రస్తావించారు. శృతి, సాగర్ లు పైన గోరమైన పాశవిక దాడి జరిగిందని దాని గురించి కెసిఆర్ ప్రభుత్వం నుండి ఇప్పటికి సమాధానం రాలేదని, ఇటువంటి సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం ఉన్న ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదని విజయశాంతి తెలిపారు. ఒకవేళ చంపడం తప్పు అయితే దీనిలో ప్రభుత్వానికి కూడా మినహియింపు లేదని విజయశాంతి సూచించారు. ఇదిలా ఉండగా అటు పోలీస్ మావోయిస్టులు కోసం గాలింపులు చేస్తున్నారు. గ్రౌండ్ హౌస్ దళాలు కూబింగ్ ను నిర్వహిస్తుండగా పోలీసులు విశాఖ ఏజెన్సీ కోసం వెతుకుతున్నాయి.

Sruthi & Vidyasagar

కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరం గా ఉన్న విజయశాంతి ఇటీవల కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయశాంతి ని స్టార్ క్యాంపైన్ర్ గా నియమించడం జరిగింది. వొచ్చే ఎలక్షన్ లో విజయశాంతి కాంగ్రెస్ తరుపున ప్రచారం చెయ్యబోతున్నారు. అయితే చాలా కాలం గా పార్టీ నుండి కీలక పదవిని ఆశిస్తున్నా విజయశాంతి క్యాంపైన్ర్ పదవితో సంతృప్తిగా లేరని కొందరి సమాచారం. ఇటువంటి వార్తలు పై విజయశాంతి స్పందన కోరగా తాను ఎటువంటి పదవి ఆశించడం లేదని, హై కమాండ్ ఆదేశం మేరకు, పార్టీ ని బలవంతం చెయ్యడం కోసం కృషి చేస్తాని తెలిపారు.

Maoists Attacks

విజయ్ శాంతి ప్రచారం చెయ్యడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొల్లగొడుతుంది అని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. తెలంగాణాలో విజయశాంతి కి ఉన్న ఇమేజ్ మైలేజ్ ని పెంచుతుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. తెలంగాణ లో తెరాస పార్టీకి దీటిగా కెసిఆర్ ని ఎదిరించగల వ్యక్తి విజయ శాంతి ప్రముఖ పాత్ర పోషిస్తారు అనడం లో ఎటువంటి సంధేయం లేదని కొందరి రాజయకీయ నిపుణులు అభిప్రాయం పడ్తున్నారు. ఇదిలా ఉండగా తెరాస పార్టీ లో మహిళా మంత్రులకు చోటు లేకపోవడం అనే అంశాలను తన అస్థ్రాలుగు గా తెరాస పార్టీ వాడుకువాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీని వాళ్ళ మహిళా ఓటర్ లను కాంగ్రెస్ వైపుకు మళ్లించడం లో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. వొచ్చే ఎన్నికలలో విజయశాంతి మెదక్ పార్లిమెంట్ నియోజగకవర్గం నుండి పోటీ చేయబోతున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.