కత్తి పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా ?

శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హైదరాబాద్‌కు దూరమయ్యాడు ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్. విజయవాడలోనే కాపురం పెట్టాడు. గతంలో మాదిరిగా టీవీ ఛానెల్స్ నిర్వహించే డిబెట్లలతో పాల్గొనడం కుదరకపోయినా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తినేనని తనపై హైదరాబాద్ సిటీలో నిషేధం మాత్రమే ఉందని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కాకుండా ఇంకా ఎక్కడైనా నివసించవచ్చని తాను ఏపీ వాడిని కాబట్టి ఇక నుంచి విజయవాడలో ఉండేందుకు గన్నవరం వచ్చానని తెలిపాడు. అంతేకాదు, కత్తి మహేష్ తన పొలిటికల్ ఎంట్రీపై సంచలన ప్రకటన చేశాడు. పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన కత్తి మహేశ్ ఎక్కడి నుంచి, ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడనేది మాత్రం చెప్పలేదు.

కత్తి పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా ? - Telugu Bullet

అయితే, ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికినట్లైంది. గురువారం జరిగిన వైసీపీ దీక్ష వల్ల కత్తి మహేశ్ ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై దాదాపుగా స్పష్టత వచ్చేసింది. గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ‘వంచనపై గర్జన’ పేరిట ఆ పార్టీ ధర్నా నిర్వహించింది. దీనికి వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇదే ధర్నాలో కత్తి మహేశ్ కూడా కనిపించారు. దీంతో అతడు వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రత్యేకహోదా కోసం ఏమీ చెయ్యని, చంద్రబాబు ప్రభుత్వం మారాలి. ప్రత్యేక హోదాకి కట్టుబడిన జగన్ ముఖ్యమంత్రి కావాలి. నా మద్దత్తు ప్రత్యేకహోదాకేఅంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది చూసిన వారందరికీ కత్తి మహేశ్ వైసీపీలో చేరడం కన్ఫార్మ్ అనే అంచనాకు వచ్చేస్తున్నారు. ఏమి జరగనుందో వెహి చూడాలి మరి.