‘కర్త కర్మ క్రియ’ టీజర్ విడుదల

Kartha Karma Kriya Teaser

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న కర్త క్రియ కర్మ సినిమా టైటిల్ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈరోజు ‘కర్త కర్మ క్రియ’ టీజర్‌ను విడుదల అయ్యింది. వసంత్ సమీర్, సెహర్, నూతన్ రాయ్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ సస్పెన్స్ పెంచేదిగా ఉంది. ఈ ఏడాది చిన్న సినిమాలు మంచి హిట్ లు అందుకోవడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు నెలకొన్నాయి. మీరూ ఈ సినిమా టీజర్  మీద ఒక లుక్ వేసెయ్యండి మరి…