‘సైరా’కు రహమాన్‌ హ్యాండ్‌ ఇచ్చాడా?

Fake News For Rahman Was Withdraw From Sye Raa Movie

Posted September 14, 2017 at 16:09 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని వారం రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. ఏఆర్‌ రహమాన్‌ సైరా వర్క్‌ స్టార్‌ చేశాడు అంటూ వచ్చిన వార్తలు సోషల్‌ మీడియాలో సందడి చేశాయి. కాని గత రెండు మూడు రోజలుగా సోషల్‌ మీడియాలో ఒక వార్త షాకింగ్‌గా వైరల్‌ అవుతుంది. అదేంటి అంటే బాలీవుడ్‌ సినిమాలతో పాటు కొన్ని హాలీవుడ్‌ సినిమాలకు సైతం కమిట్‌ అయ్యి ఉండటం వల్ల రహమాన్‌ సైరా నుండి తప్పుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

సోషల్‌ మీడియాలో ప్రచారానికి మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రహమాన్‌ అయితే సినిమా స్థాయి అమాంతం ఆకాశానికి వెళ్తుందని భావిస్తే ఆయన హ్యాండ్‌ ఇవ్వడం షాక్‌ అంటూ అంతా భావించారు. అయితే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆ వార్త పూర్తిగా ఫేక్‌ అని తేలిపోయింది. చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా ఆ వార్తను కొట్టి పారేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే సినిమాకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్‌ చేశారని ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్‌ కాస్త రిలాక్స్‌ అయ్యారు. ఇలాంటి చెత్త పుకార్లను ప్రచారం చేయడం మంచి పద్దతి కాదు అంటూ సినీ వర్గాల వారు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

సునీల్ తో త్రివిక్రమ్ సినిమా…

జైలవకుశ సెన్సార్ టాక్ వింటే పూనకాలే.

SHARE