జైలవకుశ సెన్సార్ టాక్ వింటే పూనకాలే.

Posted September 13, 2017 at 16:19 

NTR Jai Lava kusa movie censor report

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరిసిపోతున్న జైలవకుశ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో జై క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్ని ఎప్పుడు చూద్దామా అని ఫాన్స్ రిలీజ్ డేట్ కి రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. వాళ్ళ క్యూరియాసిటీ ని ఇంకా పెంచే వార్త ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమాకి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించారు. అయితే ఆఫ్ ది రికార్డు గా సెన్సార్ సభ్యులు జైలవకుశ గురించి తమ సన్నిహితులతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారట.జైలవకుశ సినిమాకి ముందు ఇది కూడా ఓ కమర్షియల్ సినిమా మాత్రమే అని చూడడం మొదలు పెట్టారట. వాళ్ళు అనుకున్నట్టు ఇది పక్కా కమర్షియల్ సినిమానే గానీ అయితే జై పాత్రలో ఎన్టీఆర్ ని చూసాక వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యిందట. ఓ కమర్షియల్ హీరో తెలుగు తెర మీద ఈ స్థాయిలో నటవిశ్వరూపం చూపడం ఎన్నడూ చూడలేదని అంటున్నారట సెన్సార్ సభ్యులు. సినిమా లో వినోదం, యాక్షన్, ఎమోషన్ ని దర్శకుడు బాబీ భలేగా మిక్స్ చేసాడట. సినిమా అంతా ఒక ఎత్తు అయితే జై క్యారెక్టర్ ఒకటి ఇంకో ఎత్తు అని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారట. ఇన్నాళ్లు దర్శకుడు బాబీ మీద వున్న అభిప్రాయం ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉందట. ఇక ఎన్టీఆర్ నటన గురించి కనీసం ఓ ఏడాది పాటు చెప్పుకుంటారని ఓ సెన్సార్ సభ్యుడు చెప్పడం చూస్తుంటే జై గా తారక్ ఎలా రెచ్చిపోయాడో వేరే చెప్పాలా ? ఈ విషయాలు చదివాక ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకాలు రాకుండా ఉంటాయా మరి ?

 

మరిన్ని వార్తలు:

నారాయణ ప్లేస్ లోకి లగడపాటి?

కమల్ స్పీడ్ కి రజని,పవన్ షాక్.

తెలుగును త‌ప్ప‌నిస‌రి చేయ‌టంపై కేసీఆర్ కు వెంక‌య్య అభినంద‌న‌

SHARE