పెళ్లికి ఒకే స్టార్‌ హీరోను ఆహ్వానించనున్న చైతూ

Naga Chaitanya Inviting Only One Star Hero For His Marriage

Posted September 13, 2017 at 16:02

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహంకు ముహూర్తం దగ్గర పడుతుంది. అక్టోబర్‌ 6న వీరిద్దరు గోవాలోని ఒక చర్చ్‌లో ఒక్కటి కాబోతున్న విషయం తెల్సిందే. మొదట క్రిస్టియన్‌ పద్దతిలో వివాహం చేసుకుని, ఆ తర్వాత హిందూ పద్దతిలో వీరు వివాహం చేసుకోబోతున్నారు. ఇక పెళ్లికి అతి కొద్ది మంది గెస్ట్‌లను మాత్రమే అక్కినేని ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గోవాలో పెళ్లి కారణంగా కొద్ది మందినే ఆహ్వానించి, అక్టోబర్‌ 10న జరుగబోతున్న రిసెప్షన్‌కు సినీ తారలందరిని ఆహ్వానించాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తుంది. అక్కినేని నాగచైతన్యనకు ఎన్టీఆర్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం చాలా మందికి తెలియదు. టాలీవుడ్‌ నుండి ఒక్క ఎన్టీఆర్‌ను మాత్రమే నాగచైతన్య గోవాలో జరుగబోతున్న పెళ్లికి ఆహ్వానించాడని తొస్తోంది. ఇక రానా కుటుంబ సభ్యుడు కనుక ఎలాగూ రాబోతున్నాడు. అంటే నాగచైతన్య పెళ్లిలో ఎన్టీఆర్‌ మరియు రానాలు మాత్రమే టాలీవుడ్‌ నుండి కనిపించబోతున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని వార్తలు:

మగధీర 2’.. విజయేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర కామెంట్స్‌

సాహోలో డ్యూయ‌ల్ రోల్ కాదు

SHARE