కమల్ స్పీడ్ కి రజని,పవన్ షాక్.

rajinikanth pawan kalyan shocked kamal haasan political entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జనసేన ఏర్పడి దాదాపు నాలుగేళ్లు అయ్యింది. ఆ టైం లో పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు బుడిబుడి నడకలు నడుస్తున్నారు. అయితే జనసేన రాజకీయ ప్రయాణం ఇంకా స్పష్టంగా మొదలు కాలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ ప్రకటన అయితే చేశారు గానీ రాజకీయంగా ఏ విధానాలు అనుసరించబోతున్నారు, ఎవరితో కలవబోతున్నారు అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పవన్ , జనసేన ని అభిమానించే వాళ్ళు సైతం ఓ సందిగ్ధం లో ఉండిపోయారు. అటు పార్టీ ఏర్పాటు గురించి పరోక్ష ప్రకటనలు చేసిన తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ సైతం ఇప్పటికీ ఏ విషయం తేల్చకుండా నానుస్తున్నారు. అయితే ఏ ఊరింపు లేకుండా నేరుగా రాజకీయ అంశాలపై తన వైఖరి వెల్లడించిన కమల్ అదే స్పీడ్ తో రజని, పవన్ లకి షాక్ ఇస్తున్నారు.

ఫాస్ట్ గా వచ్చినా క్లారిటీ గా రాజకీయ ప్రయాణం సాగిస్తున్నాడు కమల్ . తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే, జాతీయ రాజకీయాల్లో మోడీకి, బీజేపీ కి వ్యతిరేకంగా నడవాలని లాంఛనంగా ఓ నిర్ణయం తీసుకున్నారంట కమల్. అవసరం అనుకుంటే కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నాడట. అయితే ఆ అవసరం వుందో, లేదో గుర్తించేందుకు గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ 2 న పార్టీ ప్రకటన చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటించిన తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కమల్ డిసైడ్ అయ్యారంట. అక్కడ ఎదురైన ఫలితాలు చూసుకుని ఆపై రాజకీయ నిర్ణయాలు తీసుకోడానికి కమల్ రెడీ అవుతున్నారంట. మొత్తానికి ఏళ్ళకి ఏళ్ళు ఒకే విషయం మీద నాన్పుడు ధోరణి అవలంభిస్తున్న రజని, పవన్ కి కమల్ స్పీడ్ పెద్ద షాక్ కాదంటారా ?

మరిన్ని వార్తలు:

శశికళ గుట్టు మీడియా చేతికి చిక్కింది.

వైసీపీ లోకి కేవీపీ ?

నారాయణ ప్లేస్ లోకి లగడపాటి?