శశికళ గుట్టు మీడియా చేతికి చిక్కింది.

sasikala enter into jail along with ilavarasi from outside

Posted September 13, 2017 at 15:37 
అమ్మ తరువాత చిన్నమ్మ కాదంటూ అన్నాడీఎంకే శ్రేణులు శశికళని పార్టీ నుంచి గెంటేసిన షాక్ నుంచి తేరుకోకముందే ఆమెకి ఇంకో షాక్ తగిలింది. అవినీతి, అక్రమాస్తుల కేసులో బెంగుళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమెకి అక్కడ రాజభోగాలు అందుబాటులో ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని బయట పెట్టిన జైళ్ల శాఖ అధికారిణి రూపని సైతం ఎన్నో ఇబ్బందులు పెట్టింది శశికళ అండ్ కో. డబ్బు బలంతో జైలు అధికారులు సహా అందర్నీ కొనగలమన్న అహంకారంతో వ్యవహరించిన శశికళ వదిన ఇళవరసి తో సహా దర్జాగా బయటికి వెళ్లి వస్తూన్న దృశ్యాలతో పాటు మరికొన్ని మీడియా చేతికి చిక్కాయి. ఆ దృశ్యాల్లో చేత బాగ్ పట్టి, కుర్తా ధరించిన శశికళ బాగా కనిపిస్తూ వుంది. ఈ దృశ్యాలు కొత్తవి కాకపోయినా బహిరంగంగా మీడియా చేతికి చిక్కడం ఇదే మొదలు.

ఇప్పటికే జైలు శిక్ష, అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ వంటి వాటితో సతమతమవుతున్న శశికళ కి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఈ వీడియో తో పాటు శశికళకి జైల్లో కేటాయించిన సువిశాలమైన గది, ఆమె కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసిన వంట గది దృశ్యాలు కూడా బయటికి రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే శశికళ డబ్బుకి లొంగిపోయిన జైళ్ల శాఖ అధికారుల తో పాటు ఆమె జీవితం కూడా తల్లకిందులు కానుంది. ఇకపై ఎంత డబ్బు పెట్టినా ఈ స్థాయిలో రాజభోగాలు అందే అవకాశాలు ఉండకపోవచ్చు. ఈ మొత్తం వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కర్ణాటక ప్రభుత్వం మెడకి చుట్టుకునే ఛాన్స్ వుంది. అలాంటి పరిస్థితి వస్తే గనుక అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన సిద్ధరామయ్య సర్కార్ శశికళ, అవినీతి అధికారుల మీద తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత అని ఊరకే అంటారా ?

మరిన్ని వార్తలు:

వైసీపీ లోకి కేవీపీ ?

నారాయణ ప్లేస్ లోకి లగడపాటి?

SHARE