చంద్రబాబు సినిమా లో వైస్రాయ్ ఎపిసోడ్ ?

will-viceroy-episode-is-there-in-chandra-babu-life-story-movie

Posted September 13, 2017 at 11:33 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమాకి చంద్రోదయం అనే టైటిల్ పెట్టారు. ఆగష్టు 4 న మొదలైన ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇప్పటికే 75 శాతం పూర్తి అయ్యింది. ప్రకాశం జిల్లాకి చెందిన పసుపులేటి వెంకట రమణ అనే ఓ చంద్రబాబు అభిమాని ఈ సినిమా తీస్తున్నాడు. త్వరలో మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి చంద్రబాబు చేతుల మీదుగా ఆడియో విడుదల లేదా ప్రోమో విడుదల కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు జీవిత చరిత్ర అనగానే ఎన్టీఆర్ తో వివాదం, వైస్రాయ్ ఎపిసోడ్ తదితర అంశాల మీద సహజంగానే అందరికీ ఆసక్తి ఉంటుంది.

చంద్రోదయం సినిమాలో ఈ ఎపిసోడ్ ని ఎలా డీల్ చేస్తారు అన్న సందేహం చాలా మందికి వుంది. ఎంత చంద్రబాబు జీవిత చరిత్ర అయినా ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపితే జనంలో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు రేగుతాయి. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా దర్శకనిర్మాతలు తెలివిగా చంద్రబాబు రాజకీయ జీవితం మీద ఫోకస్ చేశారు. అది కూడా ఏ వివాదానికి తావులేని 1996 తర్వాత అంశాలపై దృష్టి పెట్టారు. రాజకీయంగా, పాలనాపరంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాల మీద చంద్రోదయంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఉత్త‌రకొరియా వ‌స్త్ర ఎగుమ‌తుల‌పై నిషేధం… ఐక్య‌రాజ్య‌స‌మితి క‌ఠిన ఆంక్ష‌లు

ప‌వ‌న్ ఫాలోవ‌ర్లు రెండు మిలియ‌న్లు

శ‌శిక‌ళ‌ది ఇక గ‌త వైభ‌వ‌మే…

SHARE