తెలుగును త‌ప్ప‌నిస‌రి చేయ‌టంపై కేసీఆర్ కు వెంక‌య్య అభినంద‌న‌

vice-president-venkaiah-naidu-praises-kcr

Posted September 13, 2017 at 15:43 

ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌రకు తెలుగు బోధ‌న త‌ప్ప‌నిస‌రిచేస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కేసీఆర్ నిర్ణ‌యంపై ట్విట్ట‌ర్ లో హ‌ర్షం వ్యక్తంచేశారు. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన వెంక‌య్య ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ‌ను ఆద‌ర్శంగా తీసుకుని మాతృభాష‌కు అంద‌రూ తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. వీలైనంత త్వ‌ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆశిస్తున్నాన‌ని వెంక‌య్య చెప్పారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి తెలంగాణ‌లో ప్ర‌భుత్వ్ర, ప్ర‌యివేట్ అన్న తేడాలేకుండా అన్నిర‌కాల విద్యాసంస్థ‌ల్లో ఒక‌టో త‌ర‌గతి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు ఖ‌చ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందే అని కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

తెలుగును బోధించే పాఠ‌శాల‌ల‌కు మాత్ర‌మే తెలంగాణ‌లో అనున‌మ‌తి ఉంటుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌యివేట్ స్కూళ్లు ఎన్నో ఏళ్ల నుంచి ఇంగ్లీషులోనే బోధిస్తున్నాయి. స్కూల్లో పిల్ల‌ల మ‌ధ్య‌సంభాష‌ణ కూడా ఇంగ్లీషులోనే సాగుతుంది. ఎవ‌రన్నా విద్యార్థులు స్కూల్లో తెలుగుమాట్లాడితే టీచ‌ర్లు దండించిన ఉదాహ‌ర‌ణలు కూడా చాలా ఉన్నాయి. అందుకే హైద‌రాబాద్ లోఇంగ్లీషు మీడియం స్కూళ్ల‌ల్లో చ‌దువుతున్న అనేక‌మంది పిల్ల‌లు తెలుగు చ‌ద‌వ‌టం, రాయ‌టం సంగ‌తి అటుంచి స‌రిగ్గా మాతృభాష‌లో మాట్లాడ‌లేక‌పోతున్నారు. ఉద్యోగాల కోసం, క‌మ్యూనికేష‌న్ కోసం తెలుగును ప‌క్క‌న‌పెట్టి ఇంగ్లీషు నేర్చుకోటానికి ప్రాధాన్య‌మిస్తున్నారు త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్లల‌కు ఇంగ్లీషులోనే బోధించ‌మ‌ని చెబుతున్నారు. దీంతో తెలుగు చ‌దివే, మాట్లాడ‌గ‌లిగే వారి సంఖ్య పెద్ద స్థాయిలో త‌గ్గుతోంది. ప్ర‌మాదాన్ని గ్ర‌హించిన కేసీఆర్ తెలుగును త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు:

క‌ల్బుర్గిని, గౌరీలంకేశ్ ను కాల్చింది ఒకే తుపాకితో

డేరా బాబా చిన్నారుల్ని కూడా వదిలిపెట్టలేదు.

నారాయణ ప్లేస్ లోకి లగడపాటి?

SHARE