టికెట్లు ఇవ్వ‌డంలో ఆ కండ‌క్ట‌ర్ స్ట‌యిల్ ఇదీ…

haryana-bus-conductor-new-style-in-ticket-issue-like-rajinikanth

Posted September 13, 2017 at 16:19 

ప్ర‌యాణికుల‌తో బ‌స్సు కిక్కిరిసిపోయిన‌ప్పుడు టికెట్ ఇవ్వ‌డం కండ‌క్ట‌ర్ కు చాలా క‌ష్ట‌మైన ప‌ని. అంద‌రినీ తోసుకుంటూ, చూడ‌కుండా తొక్కుకుంటూ…ముందు నుంచి వెన‌క దాకా టికెట్లు ఇవ్వ‌టానికి కండక్ట‌ర్ ప‌డే ప్ర‌యాస అంతా ఇంతా కాదు. అదీ సాధ్యం కాక‌పోతే చాలాసార్లు కండ‌క‌ర్లు బ‌స్సును ప‌క్క‌కు ఆపించి, కొంద‌రు ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించి టికెట్లు ఇవ్వ‌టం పూర్త‌య్యాక వారిని మ‌ళ్లీ బ‌స్సులో ఎక్కిస్తారు. ఏ ప్రాంతంలోన‌యినా ర‌ద్దీగా ఉండే బ‌స్సుల్లో జ‌రిగేది ఇదే. కానీ హ‌ర్యానాలోని ఓ కండ‌క్ట‌ర్ మాత్రం కిక్కిరిసి ఉన్న బ‌స్సులో టికెట్లు ఇచ్చేందుకు కొత్త ప‌ద్ధ‌తి క‌నిపెట్టాడు. బ‌స్సు సీటు మీద రెండు కాళ్లు పెట్టి…

ఒక సీటు మీద నుంచి మ‌రో సీటు మీద‌కి దూకుతూ ప్ర‌యాణికులకు టికెట్లు ఇస్తున్నాడు ఆ కండ‌క్ట‌ర్‌. ర‌ద్దీగా ఉన్న స‌మ‌యంలో చాలామంది టికెట్లు తీసుకోకుండా దిగిపోతుండ‌టంతో ఈ త‌ర‌హాలో టికెట్లు ఇవ్వ‌టం మొద‌లుపెట్టాన‌ని ఆ కండ‌క్ట‌ర్ చెబుతున్నాడు. కండెక్ట‌ర్ అలా సీట్ల‌పై నుంచి దూకుతూ టికెట్లు ఇవ్వడంపై ప్రయాణికులు కూడా ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తంచేయ‌టంలేదు. టికెట్ల కోసం కండ‌క్ట‌ర్ చేస్తున్న ఈ ఫీట్ ను బ‌స్సులోని ఓ ప్ర‌యాణికుడు వీడియోలో చిత్రీక‌రించి పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాల్లోకి ప్ర‌వేశించ‌క‌ముందు బ‌స్సు కండ‌క్ట‌ర్ గా ప‌నిచేశారు. బ‌స్సులో ప్ర‌యాణికుల‌కు కొన్ని ర‌కాల స్ట‌యిల్స్ లో చిల్ల‌ర ఇచ్చేవార‌ట‌. ఆ విన్యాసాలు చూసే ర‌జ‌నీకాంత్ కు సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చెబుతుంటారు. త‌ర్వాత రోజుల్లో ర‌జ‌నీకాంత్ స్ట‌యిల్స్ కు త‌మిళనాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింది. మ‌రి హ‌ర్యానా కండ‌క్ట‌ర్ కు కూడా అలాంటి అదృష్టం ఏమ‌న్నా ఎదుర‌వుతుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

క‌ల్బుర్గిని, గౌరీలంకేశ్ ను కాల్చింది ఒకే తుపాకితో

డేరా బాబా చిన్నారుల్ని కూడా వదిలిపెట్టలేదు.

నారాయణ ప్లేస్ లోకి లగడపాటి?

SHARE