ఉంగరాల రాంబాబు… ప్రివ్యూ.

ungarala rambabu Movie preview

Posted September 14, 2017 at 16:10 

నటీనటులు :  సునీల్ , మియా జార్జ్ , ప్రకాష్ రాజ్ , పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ 
నిర్మాత :     పరుచూరి కిరీటి 
దర్శకత్వం :   క్రాంతి మాధవ్ 
మ్యూజిక్ డైరెక్టర్ :  జిబ్రాన్ 
ఎడిటర్ :      కోటగిరి వెంకటేశ్వర రావు 
సినిమాటోగ్రఫీ : శ్యామ్  కె. నాయుడు 

ఒక్క విజయం దక్కితే చాలు అనుకుంటూ హీరో సునీల్ ఎప్పటి నుంచో వెండితెర మీద దండయాత్ర చేస్తున్నాడు. అయితే సినిమాలు వస్తున్నంత తేలిగ్గా విజయాలు రావడం లేదు. ఇక సింహా సూపర్ డూపర్ హిట్ తర్వాత విజయాల కోసం ఎంత ప్రయత్నించినా సక్సెస్ ఊసు లేకుండా పోయింది యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ సంస్థకి. ఈ ఇద్దరికీ ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సెన్సిబుల్ చిత్రాలు చేసిన దర్శకుడు క్రాంతి మాధవ్ తోడు అయ్యాడు. వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే పెద్ద అంచనాలు ఏమీ లేవు. అయితే ట్రైలర్ చూసాక సినిమాలో మ్యాటర్ వుంది అని అనిపించింది. తమ పరిధి,పరిమితుల్లోనే దర్శకుడు, హీరో ఉంగరాల రాంబాబు మీద ఆసక్తి పెంచారు. బయటికి తెలుస్తున్న దాని ప్రకారం ఈ సినిమా కథ ఇలా వుంది.

రాంబాబు జీవితం హాయిగా సాగిపోతుంటుంది. పట్టిందల్లా బంగారం అయ్యి ఆర్ధికంగా ఎదుగుతాడు. అయితే కొన్నాళ్ళకి ఆ అదృష్టం తిరగబడుతుంది. ఎక్కడ చేయి పెట్టినా కాలే పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఫలానా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ పంతులు గారు సలహా ఇస్తాడు. ఇక అప్పటినుంచి ఆ అమ్మాయి కోసం వెదుకులాట మొదలెడతాడు. ఆ అన్వేషణ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు సొంత ఆఫీస్ లోనే ముగుస్తుంది. తన ఆఫీస్ లో పని చేసే ఓ అమ్మాయిని చేసుకుంటే అంతా మారిపోతుందని రాంబాబు అనుకుంటాడు. అయితే ఆ పిల్ల ఆలోచనలు వేరుగా ఉన్నాయని తెలుసుకుని ఆమెని ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె అతన్ని ఇష్టపడుతుంది కానీ పెళ్ళికి ఓ షరతు పెడుతుంది. తన తండ్రిని కూడా పెళ్ళికి ఒప్పించాలని అడుగుతుంది. అందుకోసం ఆ పిల్ల సొంతూరు కేరళలోని ఓ గ్రామానికి వెళ్లిన రాంబాబుకి అక్కడి వ్యవహారాలు షాక్ ఇస్తాయి. ఆ పరిస్థితుల్లో అక్కడ రాంబాబు పిల్ల తండ్రిని ఒప్పించడానికి చేసిన ప్రయత్నమే ఉంగరాల రాంబాబు మిగిలిన కధ.

కథగా చూస్తే ఎప్పుడో ఏక్కడో చూసినట్టు, విన్నట్టు అనిపిస్తుంది. కానీ క్రాంతి మాధవ్ లాంటి దర్శకుడు ఇందులోనూ ఏదో కొత్తగా ట్రై చేస్తాడన్న ఆశ, ఆసక్తి కలుగుతోంది. చూద్దాం ఆ అంచనా నిజం అవుతుందో, ?

మరిన్ని వార్తలు:

తంతే బూరల బుట్టలో షాలిని పాండే

ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఇచ్చిన హోమ్ వర్క్?

ఇంకా ఓకే చెప్పని ఎన్టీఆర్‌

SHARE