తంతే బూరల బుట్టలో షాలిని పాండే

shalini-pandey-getting-quickly-new-movie-offers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హీరోయిన్‌ అవ్వాలనే పిచ్చి ఆశతో ఇంట్లో చెప్పకుండా, తండ్రిని ఎదిరించి బయటకు వచ్చిన షాలిని పాండే ఎన్నో కష్టాలు పడ్డట్లుగా చెప్పుకొచ్చింది. కెరీర్‌ ఆరంభంలో తాను ఇద్దరు కుర్రాలతో కలిసి రూమ్‌ షేర్‌ చేసుకున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. అన్ని కష్టాలను ఎదుర్కొన్న షాలిని పాండేకు ఇప్పుడు అదృష్టం అదేదో పట్టినట్లుగా పట్టింది. అనుకోని అవకాశంగా ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో ఈమె గొప్పగా నటనను కనబర్చింది ఏమీ లేదు. కాని ముద్దు సీన్‌లలో మాత్రం మెప్పించింది. దాంతో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఇటీవలే తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహానటి’లో ఒక ముఖ్య పాత్రను పోషించేందుకు అవకాశం దక్కించుకుంది. ఇక తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన ‘100%లవ్‌’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయబోతున్నారు. సుకుమార్‌ వద్ద సుదీర్ఘ కాలం అసిస్టెంట్‌గా చేసిన చంద్రమౌళి ఈ సినిమాతో తమిళంలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ రీమేక్‌లో మొదట హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుండి తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో షాలిని పాండేను ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒకే సారి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించే అవకాశం రావడంతో షాలిని ఉబ్బి తబ్బిబవుతుంది.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం