హ‌సీనా పాత్ర‌లో జీవించిన శ్ర‌ద్ధ‌

shraddha-kapoor-lively-acting-in-the-queen-of-mumbai-movie

Posted September 12, 2017 at 16:50 

సాహో హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ బాలీవుడ్ మూవీ హ‌సీనాః ది క్వీన్ ఆఫ్ ముంబై రిలీజ్ కు సిద్ద‌మ‌యింది. ముంబ‌యి అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా పార్క‌ర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమాలో శ్రద్ధ హ‌సీనా పాత్ర‌లో న‌టించింది. శ్ర‌ద్ధ త‌న కెరీర్ లో న‌టించిన‌ తొలి బ‌యోపిక్ ఇదే. ఈ సినిమా కోసం ఆమె చాలా హోం వ‌ర్కే చేసింది. హ‌సీనా నివ‌సించిన నాగ్ పాడా ప్రాంతంలో శ్ర‌ద్ధ కొన్ని రోజులు బ‌స చేసింది. హ‌సీనా జీవించి ఉన్న‌ప్పుడు ఆమెను చూసిన వారిని, ఆమె ప‌రిచ‌య‌స్థుల‌ను క‌లిసి వారితో మాట్లాడి వివ‌రాలు సేక‌రించింది.

హ‌సీనా కుటుంబస‌భ్యుల‌తో కూడా శ్ర‌ద్ధ మాట్లాడింది. హ‌సీనా గుర్తుగా ఆమె వాడిన కళ్ల‌జోడు, లిప్ స్టిక్ లు కూడా తీసుకెళ్లింది. ఈ చిత్రాన్ని అపూర్వ ల‌ఖియా తెర‌కెక్కిస్తున్నారు. హ‌సీనాతో ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ప‌రిచ‌యం ఉంది. దీంతో సినిమా తెర‌కెక్కించ‌డం అపూర్వ‌కు తేలిక‌యింది. హ‌సీనా సోద‌రుడు దావూద్ ఇబ్ర‌హీం పాత్ర‌లో శ్ర‌ద్ధ సోద‌రుడు సిద్దాంత్ క‌పూర్ న‌టించాడు. హ‌సీనా భ‌ర్త పాత్రను అంకుర్ భాటియా పోషించాడు. స్విస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 22న హ‌సీనా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. హ‌సీనా పాత్ర‌లో శ్ర‌ద్ధ జీవించింద‌ని ద‌ర్శ‌కుడు అపూర్వ ల‌ఖియా ప్ర‌శంసించారు. 30 ఏళ్ల శ్ర‌ద్ధాక‌పూర్ న‌లుగురు పిల్ల‌ల త‌ల్లిగా న‌టించ‌టానికి ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తంచేయ‌లేద‌ని…హ‌సీనా పాత్ర‌ను చాలెంజింగ్ తీసుకుని న‌టించింద‌ని ల‌ఖియా చెప్పారు.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?

SHARE