ఇంకా ఓకే చెప్పని ఎన్టీఆర్‌

Jr NTR Not Clarifying On Srinivasa Kalyanam Movie With Dil Raju

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల దిల్‌రాజు వరుసగా సూపర్‌ హిట్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద దున్నేస్తున్నాడు. ఈ సంవత్సరం ‘శతమానంభవతి’ సినిమాతో మొదలు పెట్టిన దిల్‌రాజు వరుసగా రెండు నెలలకు ఒక సక్సెస్‌ చొప్పున అందుకుంటూనే ఉన్నాడు. తాజాగా దిల్‌రాజు నిర్మాణంలో ఎన్టీఆర్‌ నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ‘శతమానంభవతి’ చిత్ర దర్శకుడు సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాసకళ్యాణం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎన్టీఆర్‌తో చేసేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడనే టాక్‌ ప్రారంభం అయ్యింది.

ఎన్టీఆర్‌కు సతీష్‌ వేగేశ్న కథ చెప్పిన మాట వాస్తవమే కాని, ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది లేదని, కాస్త టైం కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత త్రివిక్రమ్‌తో, ఆ తర్వాత కొరటాల శివతో, ఆ తర్వాత వివి వినాయక్‌తో… ఇలా వరుసగా ఎన్టీఆర్‌కు కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఆ కారణంగానే దిల్‌రాజు, సతీష్‌లకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పలేదని, తెలుస్తోంది. ఒకవేళ దిల్‌రాజుకు ఎన్టీఆర్‌ డేట్లు ఇచ్చినా కూడా అవి 2019 చివరికి లేదా 2020లో ఉంటాయని, అప్పటి వరకు సతీష్‌ వేగేశ్న ఆగుతాడా అనేది ప్రశ్న. మెగా హీరోతో ‘శ్రీనివాసకళ్యాణం’ను తెరకెక్కించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌ నో చెబితే మళ్లీ మెగా హీరో వద్దకు ఆ కథ వెళ్లే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

బాబోయ్‌.. ఏంటి ఈ కాంబినేషన్‌?