అర్జున్‌రెడ్డి పార్టీలో గలాట!

vijay-devarakonda-serious-on-star-producer-son-in-arjun-reddy-success-party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ దేవరకొండ వరుస విజయాలతో సక్సెస్‌ అవుతూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు పోటీగా దూసుకు పోతున్నాడు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టాడు. ఇక ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాడు. మహేష్‌బాబు అన్నట్లుగా లైఫ్‌ టైం ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ను కనబర్చాడు. అర్జున్‌రెడ్డి 40 కోట్లు వసూళ్లు చేసిన నేపథ్యంలో హీరో విజయ్‌ దేవరకొండ ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు. ఈ సందర్బంగా సినీ పరిశ్రమలోని తనకు ఆప్తులు అయిన వారికి పెద్ద పార్టీ ఇవ్వడం జరిగింది.

మొన్న శనివారం హైదరాబాద్‌లోని ఒక ఫేమస్‌ పబ్‌లో ఈ పార్టీ భారీ ఎత్తుగా జరిగింది. చాలా ఖర్చు చేసి మరీ విజయ్‌ దేవరకొండ పార్టీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పార్టీలో చిన్న గొడవ జరిగిందని కాస్త ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది. ఒక స్టార్‌ నిర్మాత వారసుడు కారణంగా పార్టీలో గొడవ మొదలైందట. హీరోగా చాలా కాలం క్రితం ఎంట్రీ ఇచ్చిన ఆ నిర్మాత కొడుకు సక్సెస్‌ కోసం పాట్లు పడుతూనే ఉన్నాడు. ఆ హీరో పార్టీలో కాస్త మద్యం ఎక్కువై అర్జున్‌రెడ్డి గురించి చుకన చేసినట్లుగా మాట్లాడటంతో విజయ్‌కి కోపం వచ్చిందని, దాంతో పార్టీ కాస్త సీరియస్‌ అవ్వడం జరిగిందట.

మరిన్ని వార్తలు:

జైలవ‌కుశ ట్రైల‌ర్ కు భారీ రెస్పాన్స్

ఎన్టీఆర్‌ను చూసి లక్ష్మీ ప్రణతి భయపడిన సందర్బం

మహేష్‌తో ఎన్టీఆర్‌ ఢీ.. నిలిచేనా?