జిమ్మిక్కి క‌మ్మ‌ల్ కు సుమ డ్యాన్స్

anchor-suma-dance-performance-with-jimiki-kammal

Posted September 14, 2017 at 16:28 

ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ డ్యాన్స్ చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మోహ‌న్ లాల్ న‌టించిన వెలిప‌డింతె పుస్త‌కం సినిమాలోని జిమ్మిక్కి క‌మ్మ‌ల్ పాట‌కు సుమ ఇంట్లో డాన్స్ చేశారు. ఈ వీడియోను సుమ‌ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ‌టంతో నెటిజ‌న్లు తెగ చూసేస్తున్నారు. ఈ పాట న‌న్ను ఉర్రూత‌లూగిస్తోంది అని మ‌ల‌యాళీ అయిన సుమ ఫేస్ బుక్ లో కామెంట్ చేశారు.

జిమ్మిక్కి క‌మ్మ‌ల్ పాట ఇప్ప‌డు దేశంలో ట్రెండీగా మారింది. చాలామంది ఈ పాట‌కు పేర‌డీలు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. మ‌ళ‌యాలీల ఓనం సంద‌ర్భంగా ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ కామ‌ర్స్ క‌ళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు జిమ్మిక్కి క‌మ్మ‌ల్ కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. కోటీ 18ల‌క్ష‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. వీడియోలో డ్యాన్స్ చేసిన సెరిల్ అనే అమ్మాయికి బాగా పేరొచ్చింది. ఈ వీడియో ఇంత‌గా స‌క్సెస్ కావ‌టంతో సెరిల్ తో పాట‌కు డ్యాన్స్ చేసిన వారంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అటు మ‌న దేశంలోనే కాక అమెరికాలోనూ జిమ్మిక్కి క‌మ్మ‌ల్ పాట ను అంద‌రూ ఇష్ట‌ప‌డుతున్నారు. ప్ర‌ముఖ టెలివిజ‌న్ హోస్ట్ జిమ్మీ కిమ్మ‌ల్ ఈ పాట త‌నకెంతో న‌చ్చింద‌ని ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు:

హాస్పిటల్‌ పాలైన అర్జున్‌రెడ్డి హీరోయిన్‌

‘హలో’ గురించి ఆసక్తికర విషయం

ఆసక్తి పెంచుతున్న సాయికుమార్‌ పాత్ర

SHARE