ఆమెతో మెగా హీరో ప్రేమ నిజమే, వచ్చే ఏడాది పెళ్లి

Sai Dharam Tej Got Marry With Regina Cassandra

Posted September 14, 2017 at 16:34 

మెగా బ్రదర్స్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పుడిప్పుడే హీరోగా సక్సెస్‌ అవుతూ వస్తున్నాడు. స్టార్‌ హీరో ఇమేజ్‌ సాధించాలి అంటే ఇంకా ఈయన చాలా కష్టపడాలి. మెగా మార్క్‌ను తనపై తొలగించుకునే పనిలో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. రెజీనాతో ఈయన ప్రేమలో ఉన్నాడని, ఇద్దరు కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వాటిని ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు కొట్టి పారేశారు. కాని ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

సాయి దరమ్‌ తేజ్‌, రెజీనాల విషయం వారి కుటుంబ సభ్యుల వద్దకు కూడా వెళ్లింది. మెగా ఫ్యామిలీని, తన కుటుంబంను ఒప్పించే పనిలో తేజూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి వివాహం వచ్చే సంవత్సరంలో జరుగబోతుంది. ప్రస్తుతం వివి వినాయక్‌, కరుణాకరన్‌ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్న తేజూ ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తేజూ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి నాగచైతన్య, సమంతల తర్వాత మరో హీరో, హీరోయిన్‌ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారు. చైతూ, సమంతల వివాహం వచ్చే నెలలో గోవాలో జరుగబోతున్న విషయం తెల్సిందే. తేజూ, రెజీనాల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో చూడాలి.

SHARE