చైతూకు కూడా అలాంటిదే ఫిక్స్‌ చేసిన మారుతి

Naga Chaitanya Next Movie With Maruthi Titled As Manchodu

Posted September 14, 2017 at 16:57 

యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో మారుతికి మంచి పట్టు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో మారుతి ప్రతిభ ఏంటో తేలిపోయింది. వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ చిత్రాన్ని చేసిన తర్వాత తాజాగా శర్వానంద్‌తో ‘మహానుభావుడు’ చిత్రాన్ని మారుతి తెరకెక్కించాడు. దసరా కానుకగా శర్వానంద్‌ను మహానుభావుడుగా చూపించబోతున్నాడు. మారుతి సినిమాలన్నింటిని ఒకసారి పరిశీలిస్తే ఆయన టైటిల్స్‌ విభిన్నంగా పెడతాడు. మొదటి సినిమా ‘ఈరోజుల్లో’ నుండి మొదలుకుని ‘మహానుభావుడు’ వరకు భిన్నమైన టైటిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘మహానుభావుడు’ చిత్రం తర్వాత మారుతి చేయబోతున్న సినిమాలో నాగచైతన్య నటించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ఖరారు అయ్యింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ సినిమా నిర్మాణం జరుగబోతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసేందుకు మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడు. పెళ్లి తర్వాత మంచి సినిమాలో కలిసి నటిస్తామని సమంత ఇప్పటికే చెప్పుకొచ్చింది. ఆ మంచి సినిమా మారుతి సినిమా అవుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమా కోసం మారుతి ఎప్పటిలాగే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశాడు. ‘మంచోడు’ అనే టైటిల్‌ను మారుతి రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. శర్వాను మహానుభావుడిగా చూపించిన మారుతి నాగచైతన్యను మంచోడుగా చూపించబోతున్నాడన్నమాట. వచ్చే నవంబర్‌ నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు మంచోడు వచ్చే అవకాశం ఉంది.

SHARE