మరోసారి క్రేజీ కాంబో…!

Maruthi About New Movie With Nani

నాని- మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైనర్ భ‌లే భలే మ‌గాడివోయ్ 2015లో విడుదలై నాని కెరీర్‌ నే పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా త‌ర్వాత నాని వ‌రుస విజ‌యాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నాని- మారుతి కాంబినేష‌న్ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా సమాచారం. ప్ర‌స్తుతం నాని మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ అనే చిత్రం చేస్తున్నాడు.

క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు నాని. ఈ సినిమాతో పాటు మారుతి సినిమా కూడా నాని చేయ‌నున్న‌ట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు మారుతిఅల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని గ‌తంలో ప‌లు వార్తలు రాగా, దీనిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. మరి ముందు ఏ సినిమా పట్టాలేక్కుతుందో మరి ?