రోడ్డు మీద అరటి పండ్లు అమ్మాను…!

Director Maruthi Speech On Shailaja Reddy Alludu

‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన మారుతి కెరీర్‌ ఆరంభంలో బోల్డ్‌ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన స్థాయి పూర్తిగా మారిపోయింది. మారుతి వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటున్న నేపథ్యంలో స్టార్‌ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కుతుంది. ఇటీవలే ఈయన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం విడుదల సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

maruthi-speech

మారుతి ఒక పేద కుటుంబం నుండి వచ్చాడు. మారుతి తండ్రి రోడ్డుమీద బండిపై అరటి పండ్లు అమ్మేవాడట. కొన్ని సందర్బాల్లో తాను కూడా అరటి పండ్లు అమ్మాను అంటూ మారుతి చెప్పుకొచ్చాడు. హైదరబాద్‌ వచ్చిన కొత్తలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యాను. ఆ సమయంలోనే ఒకసారి రెండు రూపాయలతో జిలేబీ కొనుకుని కడుపు నింపుకున్నట్లుగా మారుతి చెప్పుకొచ్చాడు. జీవితంలో తాను పడ్డ కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని ఆయన అంటున్నాడు. ఏ రోడ్డుపై అయితే అరటి పండ్లు అమ్మానో, ఇప్పుడు అదే రోడ్డుపై తాను కారులో తిరుగుతుంటే సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలి అంటే స్టార్‌ హీరోతో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ మారుతి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శైలజారెడ్డి అల్లుడు తర్వాత ఈయన చిత్రం మెగా హీరోతో ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

maruthi-director