త్రివిక్రమ్ కోసం మహేష్ రూట్ లో ఎన్టీఆర్.

NTR takes detoxification treatment for his body same like as Mahesh

Posted September 14, 2017 at 17:07 

టాలీవుడ్ హీరోల్లో అందగాడు ఎవరంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెప్పగలిగే పేరు ఒక్కటే… అదే మహేష్ బాబు. సినిమా విజయాల విషయంలో పోటీ ఉంటుందేమో గానీ గ్లామర్ విషయంలో మహేష్ తో పోటీకి కూడా ఏ హీరో పెద్దగా ఆలోచించడు. కానీ ఎన్టీఆర్ కి ఆ అవసరం పడింది. జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఎన్టీఆర్ తన వయసు కన్నా చిన్నగా, సన్నగా కనపడాలట . త్రివిక్రమ్ ఇచ్చిన ఈ టాస్క్ ని పూర్తి చేయడానికి ఎన్టీఆర్ మహేష్ బాబునే ఫాలో అవుతున్నాడంట.

మహేష్ ఇంత గ్లామర్ గా కనిపించడం వెనుక పెద్ద సీక్రెట్ ఏటా ఓ సారి మలేషియా డేటాక్సిఫికేషన్ థెరపీ తీసుకోవడం. ఈ థెరపీ వల్ల శరీరంలో మలినాలు మొత్తం బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల స్కిన్ టోన్ తాజాగా ఉంటుంది. జైలవకుశ రిలీజ్ అయ్యి ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్ కూడా మహేష్ రూట్ లో ఇదే డేటాక్సిఫికేషన్ థెరపీ చేయించుకుంటాడట. అయితే మలేషియా లో గాకుండా యూరప్ లో ఈ థెరపీ తీసుకోడానికి ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారంట. ఓ నెల పాటు సాగే ఈ థెరపీ పూర్తి అయ్యాక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి అవసరమైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడానికి మలేషియా లేదా హాంగ్ కాంగ్ లేదా థాయిలాండ్ వెళ్లే అవకాశం ఉందట.

SHARE