రాశిఖన్నా కూడా మొదలెట్టింది

Raashi Khanna Iteam Song in Ravi Teja Raja The Great,

Posted September 14, 2017 at 17:08 

టాలీవుడ్‌లో రాశిఖన్నా సందడి షురూ అయ్యింది. ఈ అమ్మడు మెల్ల మెల్లగా తన క్రేజ్‌ను పెంచుకుంటూ వస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’ అనే ఒక చిన్న సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు తాజాగా ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలై సక్సెస్‌ అయితే రాశిఖన్నా వెంట నిర్మాతలు క్యూలు కట్టడం ఖాయం. ఇక స్టార్‌ హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌ చేయడం పరిపాటి అయ్యింది. అదే దారిలో రాశిఖన్నా కూడా ఐటెం సాంగ్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

‘సుప్రీమ్‌’ సినిమాతో రాశిఖన్నాకు మంచి పేరు వచ్చింది. అందుకే ఆ సినిమా దర్శకుడు అనీల్‌ రావిపూడి అంటే ఈ అమ్మడికి అభిమానం. ఆ అభిమానంతోనే అనీల్‌ తెరకెక్కిస్తున్న ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో ఐటెం సాంగ్‌ను చేసేందుకు సిద్దం అయ్యింది. తన అభిమాన దర్శకుడి సినిమాలో ఐటెం సాంగ్‌ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఈమె ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చింది.

రవితేజ హీరోగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గుడ్డి వాడిగా రవితేజ కనిపించబోతున్నాడు. అలాగే రవితేజ తనయుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. దానికి తోడు రాశిఖన్నా ఐటెం సాంగ్‌.. ఇలా పలు కారణాల వల్ల సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటేలా ఉన్నాయి. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాకు రాశిఖన్నా ఐటెం సాంగ్‌ ఏ రేంజ్‌లో హెల్ప్‌ అయ్యేనో తెలియాలంటే సినిమా విడుదల వరకు చూడాల్సిందే.

SHARE