రవితేజ ఫ్యాన్స్‌కు మళ్లీ బ్యాడ్‌ న్యూస్‌

Bad News To Mass Maharaja Ravi Teja Fans

Posted September 14, 2017 at 17:16 

రవితేజ సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్బాలున్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ వెళ్లిన రవితేజ ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను విడుదల చేసింది లేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా రవితేజ సినిమా విడుదల కాలేదు. ఇది రవితేజ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్‌ అని చెప్పుకోవాలి. గ్యాప్‌ వచ్చింది కదా అని రెండు సినిమాలను రవితేజ ఒకేసారి ప్రారంభించాడు. ఆ రెండు సినిమాలు బ్యాట్‌ బ్యాక్‌ వస్తాయని ప్రేక్షకులు భావించారు. అయితే అందులో ‘రాజా ది గ్రేట్‌’ సినిమా మాత్రమే త్వరలో విడుదల కాబోతుంది. మరో సినిమా ‘టచ్‌ చేసి చూడు’ ఇప్పట్లో విడుదల అయ్యేది కష్టంగానే ఉంది. అసలు ఆ సినిమా విడుదల అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం తర్వాత మళ్లీ ఆరు నెలల పాటు గ్యాప్‌ తీసుకోవాలని భావిస్తున్నాడు. కారణం కొత్త సినిమా కోసం కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నాడు. రవితేజ పలు కొత్త సినిమాలు యాక్టెప్ట్‌ చేశాడు. అయితే అందులో మొదటగా ఏ సినిమాను చేస్తాడు అనే విషయంపై క్లారిటీ లేదు. ఏ సినిమా చేసినా కూడా రవితేజను కొత్త రూపంలో చూడటం ఖాయం అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంతో పోల్చినట్లయితే రవితేజ చాలా బక్కగా కనిపిస్తున్నాడు. అందుకే కొత్తగా నటించబోతున్న సినిమాల కోసం కాస్త లావు అవ్వడంతో పాటు, మొహంపై ముడతలు కనిపించకుండా జాగ్రత్త పడనున్నాడు. అందుకోసం టైం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇది ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్‌ న్యూస్‌గా చెప్పుకోవచ్చు.

SHARE