ఆసక్తి పెంచుతున్న సాయికుమార్‌ పాత్ర

sai kumar plays main role in Jai Lava Kusa movie

Posted September 13, 2017 at 17:58 

ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మరో వారం రోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత మూడు నెలలుగా ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ అంతా సిద్దం చేశాడు. ఇప్పటికే పాటల విడుదల కార్యక్రమం జరిగింది, ట్రైలర్‌ను విడుదల చేశారు, ప్రీ రిలీజ్‌ వేడుకను ముగించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్‌ జోరు పెంచేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాలో సాయి కుమార్‌ పోషించిన పాత్ర గురించి చర్చించుకుంటున్నారు.సినిమాలో జై రావణ, లవకుమార్‌, కుశలు హీరోలు. ఈ ముగ్గురు తర్వాత చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర సాయి కుమార్‌ పోషించిన పాత్రగా చెబుతున్నారు. సినిమాలో ఆయన చాలా కీలకంగా ఉంటాడని, కథలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనదని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సాయి కుమార్‌ ఇటీవల తెలుగులో ఆ స్థాయి పాత్రను పోషించలేదని వారు చెబుతున్నారు. ఈ మాటలతో సాయి కుమార్‌ పోషించిన పాత్ర ఏంటి, ఎందుకు అంత ప్రాముఖ్యత అంటూ ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాశిఖన్నా, నివేదా థామస్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు:

సునీల్ తో త్రివిక్రమ్ సినిమా…

జైలవకుశ సెన్సార్ టాక్ వింటే పూనకాలే.

పెళ్లికి ఒకే ఒక్క స్టార్‌ హీరోను ఆహ్వానించనున్న చైతూ

SHARE