‘హలో’ గురించి ఆసక్తికర విషయం

New Heroine Kalyani Introducing In Akhil Hello Movie

Posted September 13, 2017 at 18:17 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ రెండవ సినిమా ‘హలో’ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కథానుసారం ఈ సినిమాలో హీరోయిన్స్‌ ఇద్దరు అవసరం అని, అందుకే కళ్యాణితో పాటు నివేదితా సతీష్‌ అనే కొత్త అమ్మాయిని ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.మొదటి సినిమాతో ఫ్లాప్‌ అయిన అఖిల్‌ రెండవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రతి విషయంలో కూడా శ్రద్దగా వ్యవహరిస్తున్నాడు. అందుకే ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఉంది. అఖిల్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్స్‌ అంటూ తాజాగా వచ్చిన వార్త సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో గతంలో విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘24’ మరియు ఇతర సినిమాలను బట్టి చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇది అఖిల్‌ కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుందని అక్కినేని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఇద్దరు ముద్దుగుమ్మలతో మనోడు ఏ రేంజ్‌లో రొమాన్స్‌ చేస్తున్నాడో చూడాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు:

జైలవకుశ సెన్సార్ టాక్ వింటే పూనకాలే.

పెళ్లికి ఒకే ఒక్క స్టార్‌ హీరోను ఆహ్వానించనున్న చైతూ

SHARE