చందమామకు అది సెట్‌ అయ్యేనా…!

Kajal Agarwal Is Busy With Tamil And Telugu Movies

‘చందమామ’, ‘మగధీర’ చిత్రాలతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కాజల్‌ మారిపోయింది. ఈ అమ్మడు తెలుగులో భారీ ఎత్తున విజయాన్ని దక్కించుకోవడంతో పాటు తమిళంలో కూడా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. పుష్కర కాలంగా కాజల్‌ తెలుగులో విజయాలను దక్కించుకుంటూ వెళ్తోంది.

kajal-movies

తాజాగా ఈ అమ్మడు కాస్త డల్‌ అయ్యింది. గత కొన్నాళ్లుగా ఈమెకు మంచి సినిమాల్లో, స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కడం లేదు. దాంతో ఈమె చిన్న హీరోలతో సరిపెట్టుకుంటుంది. తెలుగులో ఈమె నటించిన సినిమాలు ఆధరణకు నోచుకోవడం లేదు.

kajal-speech

ఈ నేపథ్యంలో ఒక తమిళ మీడియా సంస్థతో ఈమె మాట్లాడుతూ… తాను హీరోయిన్‌గా చాలా కాలం సక్సెస్‌లను దక్కించుకున్నాను. ఇంకా కూడా సక్సెస్‌లు కావాలనే ఆశలేదు. ఇప్పుడు నటిగా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే మంచి పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. అందుకోసం విలన్‌ పాత్రకు కూడా తాను గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఈ అమ్మడు ప్రకటించింది. తెలుగు మరియు తమిళంలో విలన్‌ పాత్రల్లో చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ప్రకటించిన కాజల్‌కు అలాంటి ఛాన్స్‌లు వస్తాయా అనేది అనుమానమే.

kajal