కిందా మీదా పడి కాజల్‌ను ఒప్పించాడు…!

Director Prasad Verma Has Convinced Kajal To Act With Rajasekhar

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ప్రస్తుతం చిన్న హీరోతో వరుసగా చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. కళ్యాణ్‌ రామ్‌, రానా, శర్వానంద్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇలా చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ పెద్ద హీరో అయిన రాజశేఖర్‌తో నటించేందుకు మాత్రం నో చెబుతూ వచ్చింది. రాజశేఖర్‌ ‘గరుడవేగ’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే తరహా స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ‘అ!’ వంటి విభిన్న చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రశాంత్‌ వర్మ ఈమద్య కాలంలో రెండు మూడు సార్లు కాజల్‌ను కలిసినా కూడా రాజశేఖర్‌తో నటించేందుకు నో చెప్పింది.

Director Prasad Verma Has Convinced Kajal To Act With Rajasekhar

ఎట్టకేలకు రాజశేఖర్‌తో నటించేందుకు కాజల్‌ను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఒప్పించినట్లుగా తెలుస్తోంది. భారీ పారితోషికంతో పాటు, హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ స్కోప్‌ ఉండేలా స్క్రీన్‌ప్లే సాగుతుందని చెప్పడంతో కాజల్‌ ఒప్పేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న కాజల్‌ తమిళంలో మరో రెండు చిత్రాలకు కమిట్‌ అయ్యింది. తాజాగా రాజశేఖర్‌ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడంతో కాజల్‌ మళ్లీ బిజీ అవ్వబోతుంది. సీనియర్‌ హీరోలతో నటించిన హీరోయిన్స్‌ సహజంగా ఫేడ్‌ ఔట్‌ అవుతూ ఉంటారు. కాని కాజల్‌ తెలివిగా ఫేడ్‌ ఔట్‌ అవుతున్న సమయంలో చిన్న హీరోలతో నటించేందుకు ముందుకు వచ్చి మళ్లీ స్టార్‌ అయ్యింది. రాజశేఖర్‌తో నటించేందుకు కాస్త వెనుకా ముందు ఆడిన కాజల్‌ చివరకు ఒప్పేసుకుంది. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఆ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్‌ వచ్చే సంవత్సరం మొత్తం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.