రేణు దేశాయ్‌ నిర్ణయంపై విమర్శలు

Actor Renu Desai set for Tollywood comeback

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ ఈమద్య కాలంలో తెగ వార్తల్లోకి వచ్చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే రెండవ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ప్రకటించడం ద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన రేణుదేశాయ్‌ ఇప్పుడు మరోసారి ఆసక్తికర ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా రేణుదేశాయ్‌ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. నటిగా కాకుండా దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తాను అంటూ అందరిలో ఆలోచన కలిగించిన ఈమె తాజాగా మరో సంచలన ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం తెలుగులో సినిమా కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాను అని, త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది.

 Renu Desai set for Tollywood comeback

మరాఠిలో ఇప్పటి వరకు రెండు ప్రేమకథా చిత్రాలను చేసిన రేణుదేశాయ్‌ తెలుగులో కూడా అదే తరహాలో సినిమా చేస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా రైతుల సమస్యలు, వారి ఆత్మహత్యల నేపథ్యంలో రేణుదేశాయ్‌ సినిమా తీయబోతుందట. అయితే రేణుదేశాయ్‌కి ఈ సబ్జెక్ట్‌కు ఏమాత్రం సూట్‌ అవ్వదని, ఆమె అనుభవం లేమి కారణంగా సినిమా చెత్తగా వస్తుందని అప్పుడే కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ సమయంలోనే రేణుదేశాయ్‌ సన్నిహితులతో కలిసి గ్రౌండ్‌ లెవల్‌లో రైతుల జీవితాలను పరిశ్రీలిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎంతగా ప్రయత్నం చేసినా కూడా రేణుదేశాయ్‌ రైతుల సమస్యలపై సినిమా తీస్తే ఆకట్టుకోవడం అసాధ్యం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Renu Desai set for Tollywood comeback