బన్నీ చివరగా త్రివిక్రమ్‌ వద్దకు..!

Allu Arjun and Trivikram Srinivas combo again

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించినది లేదు. నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే వెంటనే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని బన్నీ చేయాలని భావించాడు. కాని ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో తదుపరి చిత్రం ఖచ్చితంగా సక్సెస్‌ అవ్వానే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం చేస్తున్నాడు. దాదాపు మూడు నెలల గ్యాప్‌ తీసుకున్న బన్నీ మరో మూడు నెలల వరకు తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. విక్రమ్‌ కుమార్‌తో సినిమా క్యాన్సిల్‌ చేసుకున్న బన్నీ తదుపరి చిత్రం కోసం పలు కథలు విన్నాడు. కాని ఏ ఒక్కటి కూడా ఆయనకు నమ్మకంను కలిగించలేదు. దాంతో అల్లు అర్జున్‌ చివరకు త్రివిక్రమ్‌ వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Allu Arjun and Trivikram Srinivas combo again

ప్రస్తుతం ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ అరవింద సమేత చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కావచ్చింది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయబోతున్నారు. నవంబర్‌ నుండి త్రివిక్రమ్‌ కొత్త సినిమాను ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని బన్నీతో చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. అందుకే కాస్త ఆలస్యం అయినా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తే ఫలితం ఉంటుందని, తప్పకుండా ఆలస్యంకు సక్సెస్‌ దక్కుతుందని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సినిమాను మొదలు పెట్టేలా త్రివిక్రమ్‌ను ఒప్పించడంలో బన్నీ సఫలం అయినట్లుగా తెలుస్తోంది. వచ్చే సమ్మర్‌ లో లేదా దసరాకి త్రివిక్రమ, బన్నీలా కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన వీరికాంబో మూవీస్‌ మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. దాంతో ఈ చిత్రం కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Allu Arjun and Trivikram Srinivas combo again