నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తెలుగు బుల్లెట్ రివ్యూ

Na Peru Surya Movie Review

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీ నటులు : అల్లు అర్జున్ , అను ఇమ్మా నుయెల్,అర్జున్, శరత్ కుమార్ తదితరులు.
నిర్మాత :శిరీషా శ్రీధర్ లగడపాటి
సమర్పణ :k.నాగబాబు
సహ నిర్మాత : బన్నీ వాసు
నిర్మాణం: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి:రాజీవ్ రవి
సంగీతం:విశాల్, శేఖర్
దర్శకత్వం:వక్కంతం వంశీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కేరళ కుట్టి అను ఇమ్మానుయెల్ జంటగా స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. లగడపాటి శ్రీధర్-నాగబాబు నిర్మాతలుగా వ్యవరించిన ఈ సినిమా టీజర్, ఆడియో, ఫస్ట్ లుక్ లు విడుదల అయిననాటి నుండి సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. సరైనోడు, డీజే లాంటి హిట్ల తర్వాత బన్నీ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో నా పేరు సూర్యపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడయితే ట్రైలర్ వచ్చిందో ఇది బన్ని పవర్ ప్యాక్డ్ సినిమా అని బన్నీ అభిమానులు ఫిక్సయిపోయారు. అయితే అనుకున్నట్టుగా భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుండా లేదా అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

భారత్ – పాకిస్తాన్ బోర్డర్‌లోని డెహ్రడూన్ మిలటరీ క్యాంప్‌లో పనిచేసే సూర్య (అల్లు అర్జున్‌) చిన్నప్పటి నుండి ముక్కుసూటి మనిషి. చిన్న కోపం వచ్చినా తట్టుకోలేడు. ఎవరు తప్పుచేసినా చిన్నా పెద్దా చూడకుండా కొట్టేస్తుంటాడు. మిలటరీ క్యాంప్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బోర్డర్‌ వెళ్లాలన్నదే అతడి లక్ష్యం. ఇంతలో పై అధికారులకు తెలియకుండా ఒక ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. అదీ కాక తనని ప్రశ్నించిన ఒక ఆర్మీ ఆఫీసర్‌ను కొట్టి సస్పెండ్ అవుతాడు. దీంతో సైనిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సూర్యను ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తాడు కల్నల్‌(బొమన్‌ ఇరానీ).

ఆర్మీకి కొన్నాళ్ళు దూరంగా ఉన్న సూర్య మరలా ఆర్మీ లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. అయితే అర్మీలోకి రావాలంటే వైజాగ్‌లో ఉన్న సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు(అర్జున్‌) దగ్గర సంతకం తీసుకొస్తే బోర్డర్‌కు పంపుతానని కల్నల్‌ చెబుతాడు. రామకృష్ణంరాజు 21రోజుల సమయం ఇచ్చి, కోపం తగ్గించుకుని రమ్మని సూర్యకు చెబుతాడు. అక్కడికి వెళ్ళిన సూర్య సంతకం చేయిస్తడా ? అతను బోర్డర్‌కి వెళ్లాడా? రఘురామ కృష్ణంరాజుకు సూర్యకు ఉన్న బంధం ఏంటి? చల్లా (శరత్‌కుమార్‌) చేస్తోన్న అన్యాయాల సూర్య ఎలా ఆపాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.

విశ్లేషణ :

కోపాన్ని అదుపులో పెట్టుకోలేని ఓ వ్యక్తి పాత్రలో అల్లు అర్జున్‌ జీవించాడు. సినిమా మొత్తం వన్ మాన్ షో, అల్లు అర్జున్ తన భుజాన వేసుకుని మోసాడు అనిపించక మానదు. ఈ పాత్ర కోసం బన్ని మారిన తీరు అభిమానులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ పాత్రను దర్శకుడు సరికొత్తగా తీర్చిదిద్దాడు. పాత్ర కోసం బన్ని పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్‌ సినిమా కే హైలైట్‌. వంశీ గతంలో కథలు అందించిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కధ గొప్పదేమీ కాదు.. కామోడీకి స్కోప్ ఉండడంతో పాటు వాటిని ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆర్మీలో ఉండే సైనికుడు బోర్డర్‌కు వెళ్లాలనుకుంటాడు. చివరకు ఆ లక్ష్యం ఏమైందో తెలియదుచాలా షార్ట్ టెంపర్‌.

చిన్న కోపాన్ని కూడా అణుచుకోలేడు. నాకు కోపం వస్తే బూతులే వస్తాయి మంత్రాలు రావు అనే సూర్య ఆర్మీలో ఉంటూ బోర్డర్‌కు వెళ్లాలని ఏడేళ్లుగా కలలు కంటూ హీరో కోపాన్ని ఏ మాత్రం అణుచుకోలేపోవడంతో అతడు పనిష్మెంట్లతో అక్కడే ఉంటాడు. హీరోయిన్‌తో బన్నీలాంటి హీరోకు లవ్ సీన్లు ఉన్నాయంటే యూత్ అంతా ఆ ప్రేమ సీన్లలో తమను ఊహించుకునేలా ఉంటాయి. కాని ఈ సినిమాలో మాత్రం అవి పూర్తి ఊహా జనితంగా ఉంటాయి. హీరోయిన్ తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని తండ్రికి చెప్పాలనంటే హీరో వెళ్లి ఆమె పీక నొక్కేస్తూ ఆవేశపడిపోతుంటాడు. సినిమా మొత్తానికి కోపం అనేదే మెయిన్ కధాంశం.

నటీనటులు :

నటీనటుల విషయానికి వస్తే హీరో అల్లు అర్జున్ కేరెక్టర్ మినహా మిగిలిన ఏ కేరెక్టర్ సరిగా డిజైన్ చేయలేదు.  హీరో కేరెక్టర్
ఇంట్రడక్షన్ బాగున్నంత ఎలివేషన్ ఉండదు. హీరోయిన్ పాటలు, మూడు నాలుగు ముద్దు సీన్ల కోసమే అనిపించింది. అర్జున్ లాంటి సీనియర్ నటుడు ఉన్నా దర్శకుడు సరిగా వాడుకోలేదు. అసలు నదియాను ఎందుకు ఉంచారో తెలియదు. సాయి కుమార్‌, వెన్నెల కిషోర్, రావు రమేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా శరత్‌కుమార్ తేలిపోయాడు.

ప్లస్ పాయింట్స్

బన్నీ ఎనర్జిటిక్ నటన, డ్యాన్సులు
యాక్షన్‌ సీక్వెన్స్ లు
ఆర్మీ ట్రైనింగ్‌
సంగీతం
ఫైట్లు
హీరోకు తండ్రికి మధ్య ఉన్న రెండు మూడు ఎమోషనల్ సీన్లు

మైనస్ పాయింట్స్

స్లో నరేషన్‌
వీక్ స్టోరీ లైన్‌
కథ, కథనాలు
క్యారెక్టర్లను, కథనాన్ని ఎలివేట్ చేయలేని డైరెక్షన్‌
సాగదీత సన్నివేశాలు

తెలుగు బులెట్ పంచ్ లైన్ : మొత్తానికి ‘సూర్య’ ప్రతాపాన్ని చూపించలేకపోయాడు.

రేటింగ్ : 2.25 / 5