బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డికి ఛాన్స్‌!

Sri Reddy In Big Boss 2 Chance

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇటీవల కాలంలో శ్రీరెడ్డి ఏ రేంజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతూ మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. ఆ కారణంగా ఈమెను బిగ్‌బాస్‌లోకి తీసుకునే అవకాశం ఉందంటూ గత రెండు మూడు రోజులుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో కుదరని విషయం. బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌కు స్టార్‌ మా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. అయితే అందులో పార్టిసిపెంట్స్‌గా కనిపించబోతున్న వారి ఎంపిక విషయంలో ఛానల్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అతి పెద్ద షో కనుక అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ షోకు ఏర్పాట్లు చేస్తుంది.

‘బిగ్‌బాస్‌’ ప్రసారం అయ్యే స్టార్‌ మాలో మెగా ఫ్యామిలీకి గతంలో పెద్ద మొత్తంలో వాటా ఉండగా, ప్రస్తుతం షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. ఈ కారణం వల్ల మెగా ఫ్యామిలీ ఇష్టానుసారంగానే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఎంపిక జరిగే అవకాశం ఉంది. అందుకే శ్రీరెడ్డిని ఎంపిక చేయబోరు అంటూ కొందరు అంచనా వేస్తున్నారు. గత కొంత కాలంగా సినీ ప్రముఖులపై మరియు ఛానెల్స్‌పై, రాజకీయ పార్టీలపై శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. ఆ కారణంగా షోకు మంచి పబ్లిసిటీ అయితే వస్తుంది కాని, సినీ పెద్దల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే శ్రీరెడ్డిని బిగ్‌బాస్‌లోకి తీసుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.