జగన్ కంటే పవనే నయం !

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో మైనర్ బాలిక మీద అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అత్యాచార ఘటన మీద జనాగ్రహం పెల్లుబికింది. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటంతో స్థానికులు నార్కట్‌పల్లి-అద్ధంకి రహదారిపై బైఠాయించి వృద్ధుడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బాలికపై అత్యాచారానికి నిరసనగా గురువారం దాచేపల్లి బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు. అయితే దాచేపల్లి ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, అదే విధంగా జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్పందించారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా దాచేపల్లి ఘటనను ఖండించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేశారు. గత కొన్ని నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే..నిందితులను సరిగా శిక్షించకపోవడం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడానికి చంద్రబాబూ..నీవు బాధ్యుడివి కాదా?` అని వైఎస్ జగన్ నిలదీశారు. అదే పవన్ కతువా నుంచి కన్యాకుమారి వరకు జరిగే అత్యాచార సంఘటనల గురించి విన్నప్పుడు తనతో సహా, పౌర సమాజం తీవ్ర ఆవేదనకు గురవుతోందని, ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసును కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకు, వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని, అసలు ఆడబిడ్డపై ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని కోరుకుంటున్నానని” పేర్కొన్నారు.

ఇక్కడే అర్ధం అవుతోంది పవన్ జగన్ ల మధ్య ఉన్న వ్యత్యాసం ఒక ప్రతిపక్ష నేత స్థానంలో ఉంది జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ ని విమర్శలు పాలు చేస్తున్నాయి. ఎందుకంటే బాధతో మాట్లాడి ఉంటె స్వాగతించవచ్చు. కానీ ఈ విషయంలో కూడా రాజకీయ లబ్ది పొందాలని జగన్ ప్రయత్నించడం దారుణాతి దారుణం. జరిగిన సంఘటన దురదృష్టకరమే ప్రతి ఒక్కరికి ఆ సంఘటన వింటుంటేనే రక్తం మరుగుతోంది కాని ఈ ఘటన ఎదో చంద్రబాబు నాయుడు ప్రోద్భలంతో చేయించి నట్టు మాట్లాడడం జగన్ అవగాహనా రాహిత్యమో లేక ఎప్పుడైనా ఎవరి మీదయినా బురద చల్లచ్చు అనుకునే మనస్తత్వమో అర్ధం కావడంలేదు. రేప్ నిందితుల మీద కఠిన శిక్షలు వేయాల్సింది కోర్టులు, అవి అమలయ్యేలా చూసుకునేది పోలీసులు. ఈ విషయం ఒక చట్ట సభ లో ఉన్న వ్యక్తికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియా లో చర్చ సాగుతోంది.

అదే సమయంలో పవన్ స్పందించిన తీరు రాజకీయాల మీద, సమాజం పట్ల పవన్ పెంచుకుంటున్న అవగాహన అర్ధమయ్యేలా చేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో అయితే నాయకుడిగా జగన్ కంటే పవన్ మేలు అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు. నిజమే మరి పవన్ కొంచెం ఆవేశంలో మాట్లాడినా అందులో ఎక్కడా నీచత్వం కనపడదు. అందుకే జగన్ కంటే పవనే వెయ్యిరెట్లు మేలని నెటిజన్లు భావిస్తున్నారు. అదే విధంగా 12 ఏళ్ల లోపు వారి మీద అత్యాచారామ్ చేస్తే ఎలా అయితే ఉరి శిక్ష అని చట్టం చేశారో అసలు అత్యాచారం చేస్తేనే మరణశిక్ష అంటూ ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే కొంచెం అయినా అఘాయిత్యాలు ఆగుతాయని నెటిజన్లు అంటున్నారు.