నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ప్రివ్యూ

Na Peru Surya Movie Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా తొలిసారిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం , అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్స్ , ప్రోమో సాంగ్స్ మొదలగున్నవి అన్ని కూడా సినిమాకు పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి.
మరి అభిమానులు పెట్టుకున్న అంచనాలను సూర్య అందుకున్నాడా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఈ లోపు రేపు నా పేరు సూర్య ఎలా ఉండబోతోందా అనే అభిమానుల టెన్షన్ ను కాస్త తగ్గించేందుకు దుబాయ్ నుంచి ప్రముఖ పంపిణిదారుడు యుఎఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సాంధు తన రివ్యూని ట్వీట్ చేసాడు. 
బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోల సినిమా ఏది విడుదలైనా దానికి సంబంధించిన రివ్యూని వెంటనే పెట్టే అలవాటున్న ఉమైర్ సందు చెప్పినవి గతంలో చాలానే నిజమయ్యాయి. కొన్ని గురి తప్పినవి ఉన్నా కూడా అధిక శాతం కరెక్ట్ అయ్యాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ కోసం మొదటి షో చూసేసిన ఉమైర్ సందు ఏమన్నాడో ప్రివ్యూ ఫై ఓ లుక్ వెయ్యండి. నా పేరు సూర్య అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్, తనదయిన పర్ఫార్మెన్స్ తో బన్నీ కట్టి పడేస్తాడు.
ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ గెటప్ అండ్ స్టైలిష్ ఫైట్స్ .. ఈ చిత్రానికి మెయిన్ బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుందట. స్టంట్స్, దర్శకత్వం, సంగీతం ఈ సినిమాకున్న అతి పెద్ద బలం. చాలా ఆసక్తికరంగా కథను నడిపిన దర్శకుడు మైండ్ బ్లోయింగ్ అనిపించాడు. రంగస్థలం, భరత్ అనే నేను తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సునామిని నా పేరు సూర్య కంటిన్యూ చేయనుంది. అను ఇమ్మానియేల్ బాగుంది. తప్పకుండా చూడండి అంటూ 3.5/5 రేటింగ్ ఇచ్చేసాడు ఉమైర్ సందు.