త‌ల్లి చీర‌లో వ‌చ్చి అవార్డ్ అందుకున్న జాన్వీక‌పూర్

Jahnavi Kapoor Receives National Best Actress Award In Place Of Sri Devi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మామ్ సినిమాలో న‌ట‌న‌కు గానూ జాతీయ ఉత్త‌మ‌నటిగా నిలిచిన శ్రీదేవి త‌ర‌పున ఆమె భ‌ర్త బోనీక‌పూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ క‌పూర్ లు అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌రిగిన అవార్డ్ వేడుక‌ల కార్య‌క్ర‌మానికి జాన్వీ త‌న త‌ల్లి చీర క‌ట్టుకుని వ‌చ్చారు. ఖుషి లంగా,వోణీ ధ‌రించి రాగా….జాన్వి మాత్రం త‌ల్లిచీర‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి శ్రీదేవిని గుర్తుకు తెచ్చారు.

అవార్డు అందుకున్న సంద‌ర్భంగా బోనీ మీడియాతో మాట్లాడుతూ చిత్ర ప‌రిశ్ర‌మ ఉన్నంత వ‌ర‌కు శ్రీదేవి అంద‌రి హృద‌యాల్లో నిలిచిపోతార‌ని, ఈ స‌మయంలో ఆమె ఉండుంటే…ఎంతో సంతోషించేవార‌ని, త‌న‌ని చాలా మిస్స‌వుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. మామ్ సినిమా కోసం శ్రీదేవి ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కింద‌ని అన్నారు. కాగా అవార్డుల వేడుక కార్య‌క్ర‌మం ఘనంగా జ‌రిగింది.

ఎప్ప‌టిలా కాకుండా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కొంద‌రికి మాత్ర‌మే త‌న చేతుల మీద‌గా అవార్డులు అందించారు. మిగిలిన వారికి కేంద్ర‌మంత్రులు రాజ్య‌వ‌ర్థ‌న్ రాథోడ్, స్మృతిఇరానీలు అంద‌జేశారు. 

Jahnavi Kapoor in Sridevi Saree