చనిపోయాక మొదటి జాతీయ అవార్డు

Sridevi Gets National Award for MOM movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతిలోక సుందరి శ్రీదేవి ఇటీవలే దుబాయిలో ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెల్సిందే. ఆమె మరణంతో ఇండియన్‌ సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన శ్రీదేవి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా, నటిగా జాతీయ అవార్డును అందుకోలేదు. ఆమె నటించిన పలు చిత్రాలకు జాతీయ అవార్డు దక్కింది. కాని ఆమెకు నటిగా మాత్రం జాతీయ అవార్డు రాకపోవడం వెలితిగా ఉండేది. అయితే గత సంవత్సరం ఆమె నటించిన ‘మామ్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది.

ఒక కూతురు గురించి ఆందోళన చెందే తల్లి పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించింది. శ్రీదేవి అద్బుతమైన నటనతో ఆ చిత్రంలో ఆకట్టుకుంది. సహజమైన నటనతో శ్రీదేవి ఆ చిత్రంకు ప్రాణం పోసింది. సినిమా విడుదలైన సమయంలోనే శ్రీదేవికి అవార్డు రావడం ఖాయం అంటూ అంతా భావించారు. అయితే ఆ సినిమా విడుదలైన కొన్నాళ్లకే ఆమె మరణించడం, ఆమె మరణించిన తర్వాత అవార్డు రావడంతో ఆమె అభిమానులు మరింతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి జీవించి ఉన్నంత కాలం ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు రాలేదు. ఆమె చనిపోయిన సంవత్సరంలోనే ఉత్తమ అవార్డు రావడం ఆమె అభిమానులకు సంతోషం కలిగించడంతో పాటు ఒకింత ఆవేదన కలిగిస్తుంది.