క‌థువా దారుణంపై క‌మ‌ల్ తీవ్ర ఆవేద‌న‌

Kamal Hassan tweets I`m sorry my child over Kathua Rape victim

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జ‌మ్మూకాశ్మీర్ లోని క‌థువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆరుగురు దుండ‌గులు జ‌రిపిన సామూహిక హ‌త్యాచారం… దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిఒక్క‌రితో కంట‌త‌డి పెట్టిస్తోంది. రాజ‌కీయ, సినీ రంగాల‌కు చెందిన పలువురు ప్ర‌ముఖులు ఈ దారుణంపై ఆవేద‌న‌వ్య‌క్తంచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ చిట్టిత‌ల్లి అనుభ‌వించిన న‌ర‌క‌యాత‌న త‌లచుకుని క‌న్నీరు కారుస్తున్నారు.

తాజాగా ప్ర‌ముఖ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీ అధినేత క‌మ‌ల్ హాస‌న్ ఖ‌తువా దారుణంపై తీవ్రంగా స్పందించారు. ఆ చిన్నారిని కాపాడుకోలేక‌పోవ‌డంపై ఓ మ‌నిషిగా, తండ్రిగా, పౌరుడిగా త‌న‌కు చాలా కోపంగా ఉంద‌ని క‌మ‌ల్ ట్విట్ట‌ర్ లో బాధ‌ప‌డ్డారు. ఈ దేశాన్ని నీకు సుర‌క్షిత‌మైన ప్రాంతంగా ఉంచ‌లేక‌పోయాం… ఐ యామ్ సారీ మై చైల్డ్… క‌నీసం, భ‌విష్య‌త్తులోనైనా నీలాంటి చిన్నారుల‌కు ఇలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు పోరాడతాను. నీ విష‌యంలో చాలా బాధ‌ప‌డుతున్నాను… అని క‌మ‌ల్ ట్వీట్ చేశారు.