శ్రీరెడ్డి తర్వాత టార్గెట్‌ మెగా ఫ్యామిలీ హీరో?

telugu actress sri reddy targets mega Family heroes

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్ని రోజులుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన శ్రీరెడ్డి తాజాగా సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ మరియు ప్రముఖ రచయిత కోన వెంకట్‌లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. కోన వెంకట్‌పై ఏకంగా రేప్‌ కేసు పెట్టబోతున్నట్లుగా ఆమె ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇక ఈమె ఆరోపణలు ముందు ముందు ఎవరిపై ఉంటాయో అని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ వర్గాల వారు ఎప్పుడు ఎవరి పేరును చెబుతుందో అని భయాందోళనకు గురి అవుతున్నారు. అందుకే శ్రీరెడ్డిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఆమెపై ఉన్న బ్యాన్‌ను ఎత్తి వేయడంతో పాటు, ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు పలువురు దర్శకులు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలోనే శ్రీరెడ్డి తర్వాత టార్గెట్‌ మెగా ఫ్యామిలీ హీరో అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

శ్రీరెడ్డి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చాలా మంది పెద్దల పేరు బయటకు వస్తాయని, అవన్ని ఒక్కటొక్కటి చొప్పున బయటకు తీసుకు వస్తాను అంటూ ఆమె పేర్కొనడం జరిగింది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన ఒక యువ హీరో గురించి ఆమె బయట పెట్టే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల్లోగుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మెగా హీరో ఎవరు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఆయన ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు అని మాత్రం అంటున్నారు. ఆ మెగా హీరో ఎవరు అనేది శ్రీరెడ్డి నోటి నుండి ఏ క్షణంలోనైనా వినే అవకాశం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే శ్రీరెడ్డి మరింత పెద్ద సంచలనం అవ్వడం ఖాయం.