ముందు పవన్… తర్వాత త్రివిక్రమ్… ఇప్పుడు అరవింద్

kathi mahesh Sensation Comments on allu aravind

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యుద్ధం ప్రకటించిన కత్తి మహేష్ అంతకంతకు శత్రువుల సంఖ్య పెంచుకుంటూ పోతున్నాడు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఫాన్స్ తో తిట్లు తినే కొద్దీ కత్తి కి కసి పెరిగిపోతూ వుంది. ఇక పవన్ ఒక్కసారి చెబితే ఆయన ఫాన్స్ తనని టార్గెట్ చేయకుండా ఉంటారని కత్తి ఆలోచన. కానీ ఆ ఒక్క మాట పవన్ నోటి నుంచి రావడం లేదు. పవన్ ఫాన్స్ తిట్లు ఆగడం లేదు. పైకి ఒంటరి పోరాటం అని చెబుతున్నప్పటికీ కత్తి కి రాజకీయంగా వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. దీంతో కత్తి తన శత్రువుల లిస్ట్ లోకి పవన్ సన్నిహితులను కూడా లాగుతున్నాడు. అజ్ఞాతవాసి సినిమా ఓ ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని కత్తి మహేష్ ప్రచారం మొదలు పెడితే పవన్ మీద కోపం అనుకున్నారు . ఇప్పుడు త్రివిక్రమ్ ఎక్కడెక్కడ నుంచి ఏది లిఫ్ట్ చేస్తున్నాడో చెప్పి పరిస్థితిని ఇంకాస్త సంక్లిష్టం చేసాడు కత్తి. అయినా త్రివిక్రమ్ కూడా నోరు మెదపలేదు.

ఇప్పుడు తాజాగా కత్తి మహేష్ కన్ను అల్లు అరవింద్ మీద పడింది. తనను అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లు గీతా ఆర్ట్స్ లో తయారు అవుతున్నాయని కత్తి మహేష్ తాజాగా ఆరోపించాడు. తన ఫోన్ నెంబర్ పవన్ ఫాన్స్ కి అందిస్తున్నది కూడా గీతా ఆర్ట్స్ నుంచే అని కూడా కత్తి అంటున్నారు. ఆ పని చేస్తున్న వాళ్ళ మీద అరవింద్ చర్య తీసుకోకపోతే తాను రంగంలోకి దిగుతానని కత్తి షరతులతో కూడిన స్మూత్ హెచ్చరిక చేసాడు కత్తి. అరవింద్ కూడా స్పందించకపోతే కత్తి ఇంకెంత దూరం వెళతాడో, ఇంకా ఎవరెవరిని ముగ్గులోకి లాగుతాడో చూడాలి.

Kathi Mahesh On PK

Kathi Mahesh On Trivikram

Kathi MAHESH Comments on Allu Aravind

ముందు పవన్... తర్వాత త్రివిక్రమ్... ఇప్పుడు అరవింద్ - Telugu Bullet ముందు పవన్... తర్వాత త్రివిక్రమ్... ఇప్పుడు అరవింద్ - Telugu Bullet ముందు పవన్... తర్వాత త్రివిక్రమ్... ఇప్పుడు అరవింద్ - Telugu Bullet ముందు పవన్... తర్వాత త్రివిక్రమ్... ఇప్పుడు అరవింద్ - Telugu Bullet ముందు పవన్... తర్వాత త్రివిక్రమ్... ఇప్పుడు అరవింద్ - Telugu Bullet ముందు పవన్... తర్వాత త్రివిక్రమ్... ఇప్పుడు అరవింద్ - Telugu Bullet