కేసీఆర్ ఏపీ ప్రవేశానికి ముహూర్తం !

Who Are Get Chance In Cabinet Telangana Cm Kcr Finalized List

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ విజయవాడ వెళ్లి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబును విమర్శిస్తానని చాలెంజ్ చేశారు. దానికి ఇప్పుడు టైం వచ్చేసిందట. అందుకు తేదీ కూడా ఖరారయిందని ఈ ఏడాది వచ్చే నెల ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ తదుపరి చర్చలు అమరావతిలో జరపాలని నిర్ణయించుకున్న జగన్, కేసీఆర్ అందుకో సందర్భాన్ని ఎంచుకున్నారు. అమరావతిలో వైఎస్ జగన్ నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన జరగనుంది. ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ హాజరు కానున్నారట ! ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయట. బయటకి ఫెడరల్ ఫ్రంట్ దేశ ప్రయోజనాలు అని చెబుతున్నా వారి ఉమ్మడి ఎజెండా చంద్రబాబు కాబట్టి మీడియా సమావేశంలో చంద్రబాబుని ఏకి పారేయాలని వారు ఇరువురూ భావిస్తున్నారట.

ఎందుకో గానీ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ప్రకటన జగన్ ని అత్యంత ప్రభావితం చేసింది. వ్యూహాలు వేయడంతో చంద్రబాబుకు సమానం అయిన కేసీఆర్ తన వైపు ఉంటె బాబుని ఓడించడం సునాసయం అని జగన్మోహన్ రెడ్డిలో నమ్మకం ఏర్పడింది. అందుకే కేసీఆర్ లో ఓ హీరోని చూస్తున్నారన్న భావన ఏర్పడింది. టీఆర్ఎస్ ఎలాగూ ఏపీలో పోటీ చేయదు కాబట్టి చంద్రబాబును ఓడిస్తే లాభపడేది తనే కాబట్టి ఆ క్రమంలో టీఆర్ఎస్ కు జగన్ బాగా దగ్గరవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్ చంద్రబాబును యాగానికి ఆహ్వానించేందుకు ఓ సారి, విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మరోసారి కేసీఆర్ రెండు సార్లు అమరావతి వచ్చారు. కానీ రాజకీయం కోసం రాలేదు. తొలి సారి రాజకీయ అవసారాల కోసం ఆయన అమరావతి రాబోతున్నారు. అయితే రెండు సార్లు ఆయన సీఎం హోదాలో వస్తుండగా ఇప్పుడు మాత్రం ఫెడరల్ ఫ్రంట్ పెద్ద స్థానంలో వస్తున్నారు. కేసీఆర్ అమరావతి పర్యటన రాజకీయాల్ని మలుపు తిప్పే వ్యవహారమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని మరింతగా రాజకీయం చేయకుండా ఉండదు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటో వైసీపీ శ్రేణులకూ అంతుబట్టడం లేదు