క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్

క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ సర్కార్

ప్రస్తుతం కరోనా కారణంగా విద్యా సంస్థలు అన్ని మూతపడ్డాయి. గత విద్యా సంవత్సరం పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే తాజాగా ఈ ఏడాదికి సంబంధించి విద్యాసంవత్సరం ప్రారంభంపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

మరో రెండు రోజులలో పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం విషయాన్ని ప్రకటిస్తామని, ఆన్‌లైన్, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిన్న కేబినెట్ నిర్ణయించిందని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రైవేట్ స్కూళ్ల విధివిధానాలు కూడా ప్రకటిస్తామని వివరణ ఇచ్చింది. అయితే ప్రభుత్వ వాదనలను విన్న హైకోర్ట్ ఈ కేసును ఈ నెల 27కి వాయిదా వేసింది.