ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌

హస్తినలోని వసంత్‌ విహార్‌లో ఏర్పాటు చేయనున్న టీఆర్‌ఎస్‌ భవన్‌ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ గురువారం భూమిపూజ నిర్వహించారు. 1100 గజాల స్థలంలో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ వసంత్‌ విహార్‌లో టీఆర్‌ఎస్‌ భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఢిల్లీలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకుంటున్న అతికొన్ని ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్‌ఎస్‌ చేరుతోంది. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలనే యోచ నలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హస్తిన పర్యటనలో భాగంగా కేసీఆర్‌ మూడురోజులు పాటు ఢిల్లీలో ఉండనున్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. అయితే ప్రధాని మోదీతో సీఎం భేటీకి సంబంధించి ఎలాంటి షెడ్యూల్‌ ఖరారు లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ మంగళవారం ఖరారవుతుందని సమా చారం.

రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుపై ప్రజాభి ప్రాయ సేకరణ జరిగిన నేపథ్యంలో కేంద్ర జలవన రుల శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్‌తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రా నికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం సమావేశం కావొచ్చని సమాచారం. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.