తెలంగాణ RTC కీలక నిర్ణయం.. వారికి సెలవులు రద్దు

Key decision of Telangana RTC.. Vacations canceled for them
Key decision of Telangana RTC.. Vacations canceled for them

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. తీసుకుంది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేసింది.

ఉచిత ప్రయాణాల నేపథ్యంలో ఈ నెల 3తో పోలిస్తే నిన్న దాదాపు 15% రద్దీ పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేసి.. శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో బస్సులు నడిపించాలని టీఎస్​ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో 31-32 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుస్తుండగా.. ఈ రోజు ఆ సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దింతో మరో 10 శాతానికిపైగా బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.