దీప్తి కేసులో కీలక పరిణామం… మరో నలుగురి అరెస్ట్..!

Key development in Deepti's case... Four more arrested..!
Key development in Deepti's case... Four more arrested..!

జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి తన ఇంట్లో అనుమానాస్పద మృతి, ఆమె చెల్లెలు అదృశ్యమైన విషయం తెలిసిందే. దీప్తి అనే 22 ఏళ్ల యువతి హైదరాబాద్ లోని మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని తన నివాసంలో దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందింది. చెల్లెలు చందన మేడ్చల్ లో బీటెక్ చదువుతుంది.

దీప్తి మృతి చెందిన తర్వాత చందన అదృశ్యం అయ్యింది. అయితే ఇంట్లో రెండు లక్షల నగదు, 30 తులాల బంగారం మాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో దీప్తి చెల్లెలు చందనతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియాతో తెలిపారు. చందన బాయ్ ఫ్రెండ్, అతని చెల్లి,తల్లితో పాటు మరొకరిని విచారిస్తున్నట్లు తెలిపారు.