కేజీఎఫ్ 2 టీజర్ రిలీజ్ ఇప్పుడు కాదు.. అప్పుడే

కేజీఎఫ్‌ హీరో యష్ కి కొనసాగుతున్న బ్యాడ్ లక్

లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ పూర్తిగా మూతపడింది. ఎక్కడా ఎలాంటి పని జరగడం లేదు. అంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు. అయితే ఈ మధ్య కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ విషయం హల్ చల్ చేస్తుంది. కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించేసిన సినిమా ‘కేజీఎఫ్‌’.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ రాఖీభాయ్‌గా క‌నిపించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా కేజీఎఫ్‌ రికార్డు కూడా సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ రూపొంద‌తుంది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు గ‌తంలో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై వుజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో రిలీజ్ అవుతుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం టీజ‌ర్ రిలీజ్ చేసే ప్ర‌ణాళిక‌లు ఏమి లేవ‌ని.. సినిమా రిలీజ్‌ ముందే ట్రైలర్ లాంచ్ అవుతుందని నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టం చేశారు. కాగా చిత్రంలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా.. రావు ర‌మేష్‌, రవీనాటండన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.