వేగంగా విస్తరిస్తోన్న మంకీ ఫీవర్

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న‌ది. దీంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే క‌రోనా కేసుల సంఖ్య 14,500పైగా నమోదు అయ్యాయి.

అయితే క‌ర్ణాట‌క‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ మ‌రో వ్యాధి క‌ల‌కలం రేపుతున్న‌ది. ఈ ఏడాది శివ‌మొగ్గ జిల్లాలో మంకీ జ్వరాలు స్టార్ట్ అయి మిగతా జిల్లాలకు విస్తరిస్తుంది.

ముఖ్యంగా రాష్ట్రమంతా చాలా వేగంగా కోతి జ్వరం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించింది. సుమారు 200 కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకాలోని కూలర్క గ్రామంలో 41 కేసులు వెలుగుచూశాయి. చిక్కమంగళూరులో 10, శివమొగ్గ జిల్లాలో 146 కేసులు వెలుగు చూశాయి.

కాగా గ‌త ఏడాది కూడా శివమొగ్గ జిల్లాలో మంకీ జ్వరాలు ప్ర‌బ‌లాయి. దాదాపు 400 మందికి మంకీ ఫీవ‌ర్ రాగా, వారిలో 23 మంది మరణించారు. ఈ ఏడాది కూడా అక్క‌డ మంకీ జ్వరాలు ప్రబలడంతో రాష్ట్ర ప్రజలు కలవరపడుతున్నారు. కాగా.. శివమొగ్గ అడవుల్లోని కోతుల ద్వారా ఈ మంకీ ఫీవ‌ర్ వ‌స్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.